twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొన్ని సన్నివేశాలు మంత్రముగ్దుల్ని చేస్తాయంటున్న డైరెక్టర్

    By Nageswara Rao
    |

    Rise of the Planet of the Apes
    'ఎక్స్‌మెన్‌- ఫస్ట్‌ క్లాస్‌' వంటి సంచలన చిత్రాన్ని నిర్మించిన ప్రపంచ ప్రఖ్యాత 'ట్వంటియత్‌ ఫాక్స్‌ స్టూడియో' నుంచి వస్తున్న మరో అద్భుత చిత్రం 'రైజ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌'. తెలుగులో 'నర వానర విప్లవం' అనే పేరుతో వస్తోంది.

    స్టార్‌వార్‌, స్పైడర్‌మ్యాన్‌, హ్యారీ పోటర్‌ వంటి సిరీస్‌ చిత్రాలకు ఇన్స్‌పిరేషన్‌గా నిలిచిన చిత్రం 'ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌'. 1968లో వచ్చిన ఈ చిత్రం అప్పటివరకు రూపొందిన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రాల్లో అత్యుత్తమమైనదిగా నిలవడమే కాకుండా, పైన పేర్కొన్న చిత్రాలకు ప్రేరణగా నిలిచింది. హాలీవుడ్‌ గ్రేట్‌ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిపోయిన 'ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం 'రైజ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌'. 'నర వానర విప్లవం' అనే ఉప శీర్షికతో తెలుగు వెర్షన్‌ వస్తోంది.

    '127 అవర్స్‌' ఫేమ్‌ జేమ్స్‌ ఫ్రాంకో హీరోగా నటించాడు. 'స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌' ఫేం ఫ్రీదా పింటో హీరోయిన్‌ పాత్ర పోషిస్తోంది. కింగ్‌కాంగ్‌, లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌ చిత్రాల ఫేం ఆండీ సెర్కిస్‌ 'సీజర్‌' అనే చింపాంజీ పాత్ర పోషిస్తున్నాడు. అవతార్‌, ది లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌, కింగ్‌కాంగ్‌ చిత్రాలకు డిజిటల్‌ ఎఫెక్ట్స్‌ అందించిన 'వీటా డిజిటల్‌' అనే సంస్థ 'రైజ్‌ ఆఫ్‌ ది ప్లాన్‌ట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌' (నర వానర విప్లవం)కు డిజిటల్‌ ఎఫెక్ట్స్‌ అందించడం విశేషమని, సన్నివేశాలన్నీ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధం చేయడం ఖాయమని చిత్ర దర్శకుడు రూపర్ట్‌ వ్యాట్‌ అంటున్నారు.

    English summary
    
 In his 2008 debut film ‘The Escapist,” director Rupert Wyatt detailed the prison break of a group of inmates. For his second, the upcoming action film “Rise of the Planet of the Apes,” the filmmaker moves on to imprisoned primates. A reboot of the classic “Planet of the Apes” franchise, “Rise” features James Franco as a scientist looking for a cure for Alzheimer’s disease.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X