హాలీవుడ్ యువ నటుడు కన్నుమూత.. 20 ఏళ్ల వయసులోనే తిరిగి రాని లోకాలకు!
హాలీవుడ్ యువ నటుడు కామెరాన్ బోయ్‌సే చిన్న వయసులోనే తిరిగి రాని లోకాలు వెళ్లిపోయారు. డిస్నీ రూపొందించే టెలివిజన్ ఫిల్మ్ సిరీస్ డిసెండెంట్స్‌లో కార్లోస్‌గా సుపరిచితుడు. కామెరాన్ వయసు 20 ఏళ్లు. అత్యంత ప్రతిభావంతుడైన కామెరాన్ చిన్న వయసులోనే మరణించడంపై సినీ లోకం దిగ్భ్రాంతికి గురైంది. మెదడు సంబంధిత బాధపడుతున్న కామెరాన్ చికిత్స పొందుతూ మరణించాడని మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
కామెరాన్ బోయ్‌సే మృతితో విషాదంలో కూరుకుపోయాం. మెదడు సంబంధిత వ్యాధి కారణంగా నిద్రలోనే ఆయన కన్నుమూశారు. చిన్నతనంలోనే అద్భుతంగా రాణిస్తున్నయువ నటుడిని సినీ పరిశ్రమ కోల్పోవడం అత్యంత బాధాకరం అని డిస్నీ అధికార వర్గాలు పేర్కొన్నాయి.

కామెరాన బోయ్‌సే మృతితో బాధలో ఉన్నాం. కాబట్టి మా కుటుంబ, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని కోరుకొంటున్నాం. మా కుటుంబానికి తీరని లోటు, ఆయన లేని లోటును ఊహించుకోలేకపోతున్నాం. కాబట్టి మమ్మల్ని ఎలాంటి ఇబ్బందికి గురిచేయవద్దు అని కామెరాన్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
2008లో మిర్రర్స్ అనే చిత్రం ద్వారా కామెరాన్ తన 9 ఏళ్ల వయసులో యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. హాలీవుడ్‌లో కామెడీ సిరీస్‌గా రూపొందిన ల్యుక్ రాస్ అచే చిత్రంలో జెస్సీగా విశేష ప్రజాదరణ పొందారు. ఆడమ్ సాండ్లర్ రూపొందించిన గ్రౌన్ అప్స్ అనే చిత్రంలో కూడా నటించి మెప్పించారు.


Click it and Unblock the Notifications











