హాలీవుడ్ ట్రేడ్ రిపోర్ట్
హాలీవుడ్ లో ఈ వారాంతం బాక్సాఫీస్ కలెక్షన్లలో డిస్నీ వారి 'ఎ క్రిస్ట్ మస్ కరోల్' సినిమా అగ్రభాగాన నిలిచింది. 31 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ సినిమా తొలి స్థానాన్ని పొందింది. అస్కార్ అవార్డ్ గ్రహీత రాబర్ట్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటోంది. ఈయన దర్శకత్వం వహించిన పోలార్ ఎక్స్ ప్రెస్, బీవూల్ఫ్ చిత్రాల్లాగే ఈ సినిమా కూడా మంచి ఆదరణ పొందుతోంది. కాగా చివరి వారం రికార్డు స్థాయి కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన మైఖేల్ జాక్సన్ 'దిస్ ఈజ్ ఇట్' సినిమా ఈ వారం రెండవ స్థానంలో నిలిచింది.
కాగా టాప్-10 సినిమాల వివరాలు ఈ విధంగా వున్నాయి:
1. ఎ క్రిస్ట్ మస్ కరోల్ ---- 31 మిలియన్ డాలర్లు
2. దిస్ ఈజ్ ఇట్ ---- 14 మిలియన్ డాలర్లు
3. ది మెన్ హూ స్టేర్ అట్ గోట్స్ --- 13.3 మిలియన్ డాలర్లు
4. ది ఫోర్త్ కైండ్ --- 12.5 మిలియన్ డాలర్లు
5. పారానార్మల్ ఆక్టివిటీ --- 8.6 మిలియన్ డాలర్లు
6. ది బాక్స్ --- 7.9 మిలియన్ డాలర్లు
7. కపుల్స్ రీ-ట్రీట్ --- 6.4 మిలియన్ డాలర్లు
8. లా అబిడింగ్ సిటిజన్ --- 6.2 మిలియన్ డాలర్లు
9. వేర్ ది వైల్డ్ థింగ్స్ ఆర్ --- 4.2 మిలియన్ డాలర్లు
10. ఆస్ట్రో బాయ్ --- 2.6 మిలియన్ డాలర్లు


Click it and Unblock the Notifications











