ల‌య‌న్ కింగ్: అదరగొట్టబోతున్న నాని, జ‌గ‌ప‌తిబాబు, ఆలీ, బ్ర‌హ్మ‌నందం

జంతువులు మనషుల్లా మాట్లాడతాయి, మిగతా జంతువులతో స్నేహం చేస్తాయి, కలిసిమెలిసి జీవిస్తాయి. ఏదయినా జంతువు కనిపిస్తే వేటాడే తినేసే రారాజు సింహం తన రాజ్యం‌లో ఉన్న జంతువులను కాపాడుతూవుంటుంది. ఇదంతా డిస్ని వాళ్లు తయారు చేసిన 'లయన్ కింగ్' అనే సినిమా కథ.

ఒకప్పుడు కార్టూన్ నెట్వర్క్‌లో కామిక్ సీరియల్‌గా వచ్చిన 'లయన్ కింగ్'.... 1990లో 2డి ఆనిమేటెడ్ సినిమాగా థియేటర్లోకి వచ్చింది. అప్పట్లో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఇపుడు ఇదే చిత్రాన్ని ఆధునిక 3డి ఆనిమేటెడ్ టెక్నాలజీ ఉపయోగించి సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తేబోతున్నారు. జులై 19న విడుదల అవుతుంది.

Disney’s The Lion King releases on 19th July 2019

డిస్నీ కామిక్ పుస్తకాల్లో పుట్టిన ఈ సింహం పేరు సింబ... 'లయన్ కింగ్' సినిమాలో సింబ అనే సింహమే హీరో. సింబ‌తో పాటు టిమోన్ అనే ముంగిస, పుంబా అనే అడివి పంది ఈ చిత్రంలో ముఖ్య పాత్రదారులుగా కనిపించబోతున్నాయి.

ఈ చిత్రం‌లో అతి కీల‌క‌మైన ముఫాసా పాత్రకు హీందీలో షారుఖ్ ఖాన్‌, తెలుగు, త‌మిళం‌లో పి.ర‌విశంక‌ర్ డ‌బ్బింగ్ చెప్పారు. అలాగే ల‌యిన్ కింగ్‌లో హీరో సింబా పాత్ర‌కి హిందీలో షారుఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ డబ్బింగ్ చెప్ప‌గా, తెలుగు‌లో నేచుర‌ల్ స్టార్ నాని చెప్పారు.

విల‌న్ పాత్రధారి స్కార్ పాత్ర‌కి బాలీవుడ్‌లో ఆశీష్ విద్యార్థి చెప్ప‌గా, తెలుగు‌లో వెర్స‌టైల్ ఆర్టిస్ట్ జ‌గ‌ప‌తి బాబు డ‌బ్బింగ్ చెప్పారు. టైమ‌న్ ముగిస పాత్ర‌కి హిందీలో శ్రేయాస్ తాల్‌ప‌డే, తెలుగు‌లో ఆలీ డ‌బ్బింగ్ చెప్పారు. పుంబ అనే అడవి పంది పాత్ర‌కి బాలీవుడ్‌లో సంజ‌య్ మిశ్రా, తెలుగులో ప్ర‌ముఖ హ‌స్య‌న‌టుడు బ్ర‌హ్మ‌నందం డ‌బ్బింగ్ చెప్పారు.

ఇంకా ఇత‌ర పాత్ర‌ల‌కి ప్ర‌ముఖుల‌తో డబ్బింగ్ చెప్పించి బాలీవుడ్‌, టాలీవుడ్‌, కొలీవుడ్ నేటివిటీకి ద‌గ్గ‌ర‌గా ఇక్క‌డి ప్రేక్ష‌కుల హృద‌యాల‌కి ద‌గ్గ‌ర‌య్యేలా డిస్ని నిర్ణయం తీసుకుంది. ఈ కార్య‌క్ర‌మాలు అన్ని పూర్తిచేసి జులై 19న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X