twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చనిపోయిన 4 ఏళ్ల చిన్నారి స్పైడర్‌మ్యాన్ ఫ్యాన్... డిస్నీ సంస్థ మనసు ఇంత కఠినమా?

    |

    అరుదైన వ్యాధితో మరణించిన నాలుగేళ్ల చిన్నారి పట్ల ప్రపంచ ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్స్ చూపిన కఠిన వైఖరి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. స్పైడర్ మ్యాన్ అభిమాని అయిన ఆ చిన్నారి సమాధిపై సాలీడు హీరో పోస్టర్ అతికించడానికి ఆ సంస్థ నిరాకరించింది. దీంతో ఆ చిన్నారి తండ్రి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.

    వివరాల్లోకి వెళితే... ఇంగ్లండ్‌కు చెందిన నాలుగేళ్ల పిల్లాడు ఓల్లీ.. స్పైడర్ మ్యాన్ అభిమాని. ఈ చిన్నారికి ల్యూకోడిస్ట్రోఫీ అనే వ్యాధిసోకి డిసెంబర్లో మరణించాడు. తన కుమారుడి ఆత్మశాంతించడానికి అంత్యక్రియల సమయంలో ఒక వ్యక్తికి స్పైడర్ మ్యాన్ వేషం వేయించి అక్కడికి రప్పించారట అతడి తండ్రి జోన్స్.

    Disney said no to Spider-Man image on 4 year old Ollie tombstone

    అంతటితో ఆగని ఆ తండ్రి తన కుమారుడికి స్పైడర్ మ్యాన్ అంటే ఎంతో ఇష్టం కావడంతో సమాధిపై స్పైడర్‌మ్యాన్ బొమ్మ వేయించాలనుకున్నారట. ఇందుకోసం డిస్నీ సంస్థ అనుమతి కోసం లేఖ రాశాడు. అయితే ఆ సంస్థ నుంచి జోన్స్‌కు ఊహించని సమాధానం వచ్చింది. సమాధులపై మా సినిమాలకు సంబంధించిన పోస్టర్లు అటించడానికి డిస్నీ నింబంధనలు ఒప్పుకోవు అని తెలిపారట.

    Disney said no to Spider-Man image on 4 year old Ollie tombstone

    అయితే డిస్నీ సంస్థ నుంచి వచ్చిన ఈ సమాధానంపై జోన్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుమారుడు జీవించి ఉన్నపుడు ఇష్టమైన స్పైడర్‌మ్యాన్ బొమ్మలన్నీ కొనిచ్చాను. కానీ సమాధిపై పోస్టర్ వేయడానికి ఆ సంస్థ ఒప్పుకోక పోవడం తనను ఎంతో బాధించిందని తెలిపారు. డిస్నీ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

    English summary
    4-year-old Ollie Jones had always been a huge fan of Spider-Man. When he died from the rare disease leukodystrophy in December, his father planned to put an image of Spidey on Ollie’s tombstone. But Disney said no.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X