బాక్సాఫీసు వద్ద కనర వర్షం కురిపిస్తున్న యానిమేషన్ సినిమా..!!
యానిమేషన్ సినిమాలను రూపొందించడంలో దిట్ట అయిన డిస్నీ సంస్థ రూపొందించిన మరో యానిమేషన్ సినిమా 'ది ప్రిన్సెస్ అండ్ ది ఫ్రాగ్' సినిమా హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి ఈ వారం ట్రేడ్ రిపోర్ట్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది. గ్రిమ్ బ్రదర్స్ రాసిన 'ది ఫ్రాగ్ ప్రిన్స్' కథ ఆదారంగా రూపొందిన ఈ సినిమా బహుళజనాధరణ పొందుతూ ఈ వారంలోనే 25 మిలియన్ డాలర్లను వసూలు చేసి టాప్ చైర్ లో నిలిచింది.
ఫుట్ బాల్ ఆటగాడి జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని రూపొందించిన 'ది బ్లైండ్ సైడ్' సినిమా 15.5 మిలియన్ డాలర్లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది. 1995లో దక్షిణ ఆఫ్రికా లో జరిగిన రగ్బీ వరల్డ్ కప్ సమయంలో దక్షిణ ఆఫ్రికా మాజీ అధ్యక్షుడు, నోబుల్ శాంతి బహుమతి గ్రహీత నెల్సన్ మండేలా జీవిత చరిత్రను మూల కథగా తీసుకొని రూపొందించిన 'ఇన్విక్టస్' సినిమా 9.1 మిలియన్ డాలర్లు వసూలు చేసి మూడవ స్థానంలో నిలిచింది.
ట్విలైట్ స్యాగా సీక్వెల్ గా వచ్చిన 'న్యూ మూన్' సినిమా ఈ వారం 8 మిలియన్ డాలర్లు వసూలు చేసి నాల్గవ స్థానంలో నిలువగా, డిస్నీ సంస్థ రూపొందించిన 'ఎ క్రిస్ట్ మస్ కరోల్' సినిమా 6.9 మిలియన్ డాలర్లు వసూలు చేసి ఐదవ స్థానంలో నిలిచింది.
ఈ వారం ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం హాలీవుడ్ బాక్సాఫీసు వద్ద టాప్ ప్లేస్ లో నిలిచిన పది సినిమాల వివరాలు ఈ విధంగా వున్నాయి:
1. ది ప్రిన్సెస్ అండ్ ది ఫ్రాగ్ ---- 25 మిలియన్ డాలర్లు
2. ది బ్లైండ్ సైడ్ ---- 15.5 మిలియన్ డాలర్లు
3. ఇన్విక్టస్ ---- 9.1 మిలియన్ డాలర్లు
4. న్యూ మూన్ ---- 8 మిలియన్ డాలర్లు
5. ఎ క్రిస్ట్ మస్ కరోల్ ---- 6.9 మిలియన్ డాలర్లు
6. బ్రదర్స్ ---- 5 మిలియన్ డాలర్లు
7. 2012 ---- 4.4 మిలియన్ డాలర్లు
8. ఓల్డ్ డాగ్స్ ---- 4.39 మిలియన్ డాలర్లు
9. ఆర్మోర్డ్ ---- 3.5 మిలియన్ డాలర్లు
10. నింజా అస్సెస్సిన్ ---- 2.7 మిలియన్ డాలర్లు


Click it and Unblock the Notifications











