ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్ ను నిర్ణయించే 'ప్రొడ్యూసర్స్' అవార్డు ఏ చిత్రానికి..??
హాలీవుడ్ లో ప్రస్తుతం సైంటిఫిక్ సినిమాల హవా నడుస్తోంది. అవతార్, స్టార్ ట్రెక్, డిస్ట్రిక్ట్ 9 వంటి సైంటిఫిక్ సినిమాలు హాలీవుడ్ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి. తాజాగా ఇప్పుడీ చిత్రాలు ఆస్కార్ అవార్డు ఏ సినిమాకు రానుందో నిర్ణయించే ప్రొడ్యూసర్స్ గిల్డ్ అవార్డులకు నామినేట్ అయ్యాయి. గత ఏడాది ఉత్తమ సినిమాగా ఆస్కార్ అవార్డును సాధించిన సినిమా స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా ఈ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అవార్డును సొంతం చేసుకుంది. అంతకు ముందు ఏడాది కూడా సియోన్ బ్రదర్స్ నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్ సినిమా కూడా ప్రొడ్యూసర్స్ గిల్డ్ అవార్డును సొంతం చేసుకున్న తర్వాత వెళ్లడించిన ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. దీన్ని బట్టి చూస్తుంటే ప్రొడ్యూసర్స్ గిల్డ్ అవార్డును సొంతం చేసుకున్న సినిమాకే ఆస్కార్ అవార్డ్ రావడం ఆనవాయితీగా వస్తోంది. మరి ఈ ఏడాది ఏ సినిమాకు ఆస్కార్ రానుందో తెలుసుకోవాలంటే ఈ నెల 24 వరకూ ఆగాల్సిందే. ఎందుకంటే అదే రోజున ప్రొడ్యూసర్స్ గిల్డ్ అవార్డులను ప్రకటిస్తారు...
ఈ అవార్డుకు నామినేట్ అయిన చిత్రాల వివరాలు ఇలా వున్నాయి:
1. అవతార్
2. డిస్ట్రిక్ట్ 9
3. యాన్ ఎడ్యుకేషన్
4. ది హర్ట్ లాకర్
5. ఇన్ గ్లోరియస్ బాస్టర్డ్స్
6. ఇన్విక్టస్
7. ప్రీషియస్
8. స్టార్ ట్రెక్
9. అప్
10. అప్ ఇన్ ది ఎయిర్


Click it and Unblock the Notifications











