పెళ్లి జరిగి మూడు నెలలు గడవకుండానే విడాకులు
హాలీవుడ్ సెక్సీ తార కిమ్ కర్దాషియాన్ ఎంతగానో ఇష్టపడి అంగరంగ వైభవంగా బాస్కెట్ బాల్ ప్లేయర్ క్రిస్ హాంప్రస్‌ని అక్టోబర్ 31న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఏమైందో ఏమో గానీ సడన్‌గా 31సంవత్సరాలు వయసు కలిగిన కిమ్ కర్దాషియాన్ పెళ్లి చేసుకొని 72 రోజుల పూర్తి అయిన వెంటనే విడాకుల కొసం కొర్టుని ఆశ్రయించడం జరిగింది.
అసలు కిమ్ కర్దాషియాన్ విడాకుల కొసం కొర్టుని ఎందుకు ఆశ్రయించిందో అంతుపట్టకుండా ఉంది. ఇటీవల మీడియాలో కిమ్ కర్దాషియాన్ దర్శనమిచ్చినప్పుడు పెళ్లి జరిగి కనీసం మూడు నెలలు గడవక ముందే మీరు విడాకులు తీసుకొవడానికి గల కారణాలను వెల్లడిస్తారా అని ప్రశ్నించగా, నేను కేవలం నా మనసుని నమ్మాను. నా మనసు ఎలా చెప్తే అలా చేస్తున్నానని అన్నారు.
కొన్ని కొన్ని సందర్బాలలో మనసు చెప్పిన మాటలు వినాలని ఏదో వేదాంతం వినిపిస్తుంది. ఇది ఇలా ఉంటే న్యూయార్క్‌లో జరిగిన మిధోరి గ్రీన్ పార్టీలో బ్యాట్‌మెన్ సినిమాలో బ్యాట్‌మెన్ శత్రువుగా నటించే 'పాయిజన్ లెవీ' డ్రస్సు ధరించి అక్కడున్న వారందరిని అలరించారు. అంతేకాకుండా కిమ్ కర్దాషియాన్ ధరించిన హాలోవీన్ డ్రస్సుకి గాను 'బెస్ట్ సెలబ్రిటీ' అవార్డుని సైతం కైవసం చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











