నా భర్తతో విడాకులు తీసుకున్నా కూడా నేను తల్లిని అవుతా..ఏంటీ ప్రాబ్లమ్
ఇవా లంగోరియా ఇటీవల కాలంలో హాలీవుడ్ లోఎక్కువగా వినిపిస్తున్న పేరు. దీనికి కారణం తను ఎంతోగానో ప్రేమించినటువంటి భర్తనుండి విడాకులు తీసుకోవడానికి సిద్దపడడమే. ఇవా లంగోరియా డిస్పరేట్ హౌస్ వైప్స్ అనే షోద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. 2007వ సంవత్సరంలో బాస్కెట్ బాల్ ప్లేయర్ టోనీ పార్కర్ నుపెళ్శి చేసుకోవడం జరిగింది. కోన్ని అనివార్యకారణాల వల్ల ఇటీవలే ఇద్దరూ విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకున్నారు. ఐతే ఈవిషయాన్ని దృవీకరించినటువంటి ఇవా లంగోరియా తన భర్తనుండి విడిపోయినప్పటికి తాను తల్లిగా వ్యవహారించడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు.
తన భర్త నుండి విడిపోయినప్పటికీ తాను తల్లిగా ఎలాగ ఉంటుందని అనుకుంటున్నారా. ఇటీవల కాలంలో పిల్లలను చాలా మంది హాలీవుడ్ హీరోయిన్లు తమ భర్తల నుండి విడిపోయినప్పటికీ దత్తతు తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మనం సాంద్రా బుల్లక్ నుగమనించినట్లైతే తన భర్తనుండి విడిపోయినప్పటికీ హైతీ భూకంప భాధితుల్లో నష్టపోయిన పిల్లలను దత్తతు తీసుకోని చాలా మందికి ఆదర్శంగా నిలిచారు.
గతంలో ఇవా లంగోరియా కాలిఫోర్నియా కుసంబంధించినటువంటి ఛారిటీ సంస్ద పాడ్రస్ కాంట్రా ఇఐ క్యాన్సర్ కుతన విరాళాలు సేకరించి వంతు సహాయాన్ని అందించారు. ఈసందర్బంగా ఇవా లంగోరియా మాట్లాడుతూ ఇలా ఎవరికైనా ఆపదలో ఉన్నవారికి సాయం చేసినప్పుడు నేను పోందినటువంటి అనుభూతి మాటల్లో చెప్పేలేనంతగా ఉంటుందని అన్నారు. అందుకే నేను కూడా హైతీ భూకంప భాధితుల్లో ఒకరిని దత్తతు తీసుకోవాలని నిర్ణయించుకన్నానని అన్నారు. ఐతే నేను మరియు టోనిపార్కర్ ఇద్దరం కలసి దత్తతు తీసకుంటే తనకూడా చాలా ఆనందంగా ఫీలయ్యేవాడని అన్నారు. కాని ప్రస్తుత పరిస్ధితుల్లో నేను ఒక్కదాన్నే సింగిల్ పేరంట్ గా దత్తతు తీసుకోవడం కోంచెం భాదగా ఉందని అన్నారు.


Click it and Unblock the Notifications











