ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమే మామద్య అలాంటి సంబందం లేదు
బ్రిటీష్ రాపర్ డిజ్జి రాస్కెల్ మరియు ఆస్ట్రేలియా సింగర్ నటాలీ ఇంబ్రూగ్లియా ఇద్దరూ డేటింగ్ చేసుకుంటున్నారన్నవిషయాన్ని డిజ్జి రాస్కెల్ కొట్టి పారేశారు. వీరిద్దరి మద్య ఈరూమర్స్ రావడానికి కారణం క్రిస్టమస్ కువీరిద్దరూ కలసి లండన్ వీధుల్లో తిరగడమేనని ప్రముఖ దినపత్రిక హెరాల్డ్ సన్ ప్రచురించింది. లండన్ లోని మేఫెయిర్ ఏరియాలో వీరిద్దరూ కలసి షాపింగ్ చేసిన విధానం కూడా ఇందుకు తావిచ్చింది. షాపింగ్ సమయంలో వీరిద్దరూ ఒకరినొకరు చేతిలో చెయ్యివేసుకోని షికారు చేశారని చూసిన వాళ్శంతా అనుకుంటున్నారు. ఇది మాత్రమే కాకుండా డిజ్జి రాస్కెల్ మరియు నటాలీ ఇంబ్రూగ్లియా ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. వీరిద్దరూ మొట్టమొదట బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ కుచెందినటువంటి ప్రయివేటు ఐస్ లాండ్ రిసార్ట్ లోమీటింగ్ నిమిత్తం కలవడం జరిగిందని ఓఫంక్షన్ లో డిజ్జి రాస్కెల్ అన్నారు.


Click it and Unblock the Notifications











