టాప్ హీరోయిన్ బాయ్‌ఫ్రెండ్ మృతి.. మరణానికి కారణం ఏమిటంటే?

హాలీవుడ్ నటి సండ్రా బుల్లాక్ సుదీర్ఘ కాలంగా డేటింగ్ చేస్తున్న ఆమె జీవిత భాగస్వామి బ్రయన్ రాండాల్ తుదిశ్వాస విడిచారు. ఆమ్యోట్రాఫిక్ లేటరల్ సెరోసిస్ వ్యాధితో మూడేళ్లుగా పోరాడుతూ ఏఎల్‌ఎస్ హాస్పిటల్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. ఆయన ప్రశాంతంగా ఈ లోకం నుంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మధ్య లేకపోవడం అత్యంత విషాదకరం అని సన్నిహితులు ఓ ప్రకటనలో తెలిపారు. బ్రయన్ రాండాల్ వ్యక్తిగత జీవితం, సాండ్రా బుల్లాక్‌తో ప్రైవేట్ జీవితం వివరాల్లోకి వెళితే..

బ్రయన్ రాండాల్ విషయానికి వస్తే అమెరికాలోని లాస్ ఎంజెలెస్‌లో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. బ్రయన్ రాండాల్ ఫోటోగ్రఫి అనే కంపెనీని నడుపుతున్నారు. ఓ ఈవెంట్‌లో పరిచయమైన బ్రయన్‌ మనసుకు సాండ్రా బుల్లాక్ చేరువయ్యారు. అప్పటి నుంచి అంటే 2015 నుంచి వారిద్దరు డేటింగ్ చేస్తున్నారు అని హాలీవుడ్ మీడియా వెల్లడించింది.

Sandra Bullock Boy Friend Bryan Randall died

అయితే బ్రయన్‌తో అఫైర్, డేటింగ్ వ్యవహారాన్ని సాండ్రా గుట్టుగా దాచిపెట్టింది. 2021 డిసెంబర్‌లో రెడ్ టేబుల్ టాక్ షో సందర్భంగా అధికారికంగా తన ప్రైవేట్ రిలేషన్‌ను బయటపెట్టింది. బ్రయన్ తన ప్రేమికుడు అంటూ ఆమె కామెంట్ చేసింది. మేమిద్దరంకి ముగ్గురు పిల్లలను తల్లిదండ్రులుగా ఉన్నాం. రాండాల్‌కు ఓ కూతురు ఉంది. మరో ఆడపిల్లలను లూయిస్, లైలాను సాండ్రా దత్తత తీసుకొన్నారు.

Sandra Bullock Boy Friend Bryan Randall died

ఆమ్యోట్రాఫిక్ లేటరల్ సెరోసిస్ (ALS) విషయానికి వస్తే.. ఈ వ్యాధి అరుదైన నాడి సంబంధిత వ్యాధి. మెదడులోని కీలక నాడి వ్యవస్థ దెబ్బ తినడం ద్వారా ఈ వ్యాధితో బాధపడుతారు. ఈ వ్యాధి వల్ల వెన్నుముక సంబంధిత సమస్యలు, కండరాల బలహీనత ఏర్పడుతుంది. ఈ వ్యాధి సోకిన వారి నడవడం, మెమొరీ సంబంధిత సమస్యలు తలెతుత్తాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X