900 కోట్లు ఇస్తే విడాకులు ఇస్తా.. సూపర్ స్టార్‌కు భార్య కండిషన్.. డైవోర్స్‌కు సిద్దమైన హీరోయిన్ ఎవరో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకుల వ్యవహారంపై హాలీవుడ్‌లో చర్చ జరుగుతున్నది. గత కొద్ది నెలలుగా హాలీవుడ్ తారలు జెన్నిఫర్ లోపేజ్, బెన్ అఫ్లెక్ జంట డైవోర్స్‌పై భారీగా చర్చ జరుగుతున్నది. అయితే విడాకులు తీసుకోవడానికి బెన్ నుంచి జెన్నిఫర్ కోరుతున్న భరణం వింటే ఎవరికైనా గుండె జారిపోవాల్సిందే. అయితే ప్రస్తుతం వరల్డ్ వైడ్ డిబేట్‌గా మారిన ఈ జంట డైవోర్స్ వెనుక కథలోకి వెళితే..

హాలీవుడ్‌లో పాపులర్ సెలబ్రిటీ జెన్నీఫర్ లోపేజ్ దాంపత్య జీవితానికి వస్తే.. బెన్‌ అఫ్లెక్‌తో విడాకులు జరిగితే.. ఆమెకు అధికారికంగా 5వ సారి బ్రేకప్. గతంలో ఓజానీ, మార్క్ ఆంథోని, క్రిస్ జూడ్‌తో బ్రేకప్ జరుగగా.. బెన్ అఫ్లెక్‌తో రెండుసార్లు బ్రేకప్ జరిగింది. బెన్ అఫ్లెక్ విషయానికి వస్తే.. ఇది మూడోసారి బ్రేకప్. గతంలో జెన్నిఫర్ గార్నర్, ప్రస్తుతం జెన్నిఫర్‌తో విడాకులు జరిగాయి. అయితే జెన్నీఫర్ జీవితంలో ఈ సారి కూడా విడాకులు అనివార్యంగా మారాయి.

Do You Know Jennifer Lopez demanding 625 Crores alimony from Ben Afflek for Divorce Settlement

హాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. ఇద్దరి మధ్య విడాకులు వ్యవహారంపై వారి వారి లాయర్లు చర్చలు జరుపుతున్నారు. వారిద్దరి మధ్య అవగాహన కుదిర్చి డైవోర్స్ ఇప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే బెన్ నుంచి విడాకులు తీసుకోవడానికి అతడి ఆస్తిలో సగం వాటా అడుగుతున్నదనే ప్రచారం జరుగుతున్నది.

ఇక జెన్నీఫర్ లోపేజ్ విషయానికి వస్తే.. ఆమె ఆస్తి విలువ 400 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 3340 కోట్ల రూపాయలు, ఇక బెన్ అఫ్లెక్ ఆస్తుల విలువ విషయానికి వస్తే..150 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 1250 కోట్ల రూపాయాలు. అయితే విడాకులు తీసుకోవడానికి ఆయన ఆస్తిలో సగం అంటే..900 కోట్లకుపైగా భరణం కోరుతున్నట్టు సమాచారం.

Do You Know Jennifer Lopez demanding 625 Crores alimony from Ben Afflek for Divorce Settlement

అయితే ఈ రేంజ్‌లో భరణం అడగడం వెనుక ఓ కథ ఉంది. బెన్ అఫ్లెక్‌తో పెళ్లి చేసుకొనే సమయంలో విలాసవంతంగా ఖర్చు చేసింది. దాదాపు 60 మిలియన్ల విలువైన అత్యంత విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసింది. అంతేకాకుండా ప్రైవేట్ జెట్ బిల్స్, బట్టలు, విందు, వినోదాల ఖర్చు మొత్తం ప్రస్తుతం రాబట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం.

More from Filmibeat

Read more about: jennifer lopez hollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X