ఆ విషయం, అభిమానులు తప్పుగా భావించకూడదు
27సంవత్సరాలు వయసు కలిగిన హాలీవుడ్ సెక్సీ స్టార్ ఓలివియా విల్డీ ఇటాలియన్-అమెరికా ఫీల్మ్ మేకర్ రుస్పోలీని సీక్రెట్‌గా 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకొవడం జరిగింది. ఎనిమిది సంవత్సరాలు కలసి ఉన్నఈ జంట కొన్ని కారణాల వాళ్ల ఇటీవలే ఫిబ్రవరిలో విడిపోవడం జరిగింది. 'కౌబాయ్స్ అండ్ అలైన్స్' సినిమా నగ్నంగా నటించిన ఈ స్టార్ హీరోయిన్ ఇటీవల పెళ్లి చేసుకున్న కిమ్ కర్దాషియాన్ తన భర్తతో 72 రోజులు గడవక ముందే విడాకులు తీసుకొవాలని నిర్ణయించుకున్న విషయంపై తనదైన శైలిలో స్పందించారు.
ఈ సందర్బంలో ఓలివియా విల్డీ మాట్లాడుతూ కిమ్ కర్దాషియాన్‌ని అభిమానులు క్షమించాల్సిందిగా కొరడం జరిగింది. అందుకు కారణం తను ఎంతగానో ప్రేమించి, అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న బాస్కెట్ బాల్ స్టార్ ఆటగాడు క్రిస్ హాంప్రస్ నుండి 72 రొజులు గడవక ముందే విడాకులు కొరడం జరిగింది. ఈ నిర్ణయం కిమ్ కర్దాషియాన్ జీవితంలో తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయంగా భావిస్తున్నాను.
ప్రపంచంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్బాన్ని అర్దం చేసుకొవాలని కొరుతున్నాను. అంతే కాకుండా కిమ్ ఎప్పుడైనా పబ్లిక్ ఫంక్షన్స్‌కి వచ్చినప్పుడు ఆమెపై అభిమానులు కిమ్ ఎందుకు ఇలా చేసిందంటూ ఆమైపై చేయి చేసుకుండా, ఉండాలని నేను కొరుకుంటున్నానని అన్నారు. సాధారణంగా ఎవరైనా సెలబ్రిటీ జంటలు విడిపోతుంటే అభిమానులు వారిపై సరైన ఓపెనియన్ లేకుండా ఉంటారనే భావంతోనే ఇవన్నీ ప్రస్తావించాల్సి వస్తుందని అన్నారు. ఇది ఇలా ఉంటే ఇటీవలే కిమ్ కర్దాషియాన్ తన భర్త క్రిస్ హాంప్రస్‌తో అభిప్రాయ బేధాలు రావడంతో విడాకుల కొరిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











