twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను నిపుణుల పర్యవేక్షణలో బరువు తగ్గించా: అన్నే హాత్వే

    By Nageswara Rao
    |

    హాలీవుడ్ నటి అన్నే హాత్వే బరువు కోల్పోవడం కోసం ఆహారం తీసుకోకుండా ఉండడం అనేది సరైన కారణం కాదని, ఆ విధంగా తనను అనుసరించవద్దని యువ అభిమానులు కోరారు. అన్నే హాత్వే ఇలా అభిమానులను కోరడానికి కారణం 'లెస్ మిసరబుల్స్' అనే సినిమాలో పలుచని వేశ్య పాత్ర కోసం చాలా రోజులు భోజనం చేయకుండా డైటింగ్ చేశారు. దీంతో బరువు తగ్గినప్పటికీ.. ఆమె కొంత కాలం అనారోగ్యం పాలైంది.

    29 సంవత్సరాల వయసు కలిగిన అన్నేహాత్వే శిక్షణ పొందిన నిపుణుల పర్యవేక్షణలో బరువుని తగ్గించానని, అంతేకానీ ఇది ఎవరినీ కాపీ చేయడం కానీ, సరదాగా చేసినది కాదని నొక్కి మరీ చెప్పింది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మొదటి మూడు వారాలలో 10 పౌండ్లు తగ్గానని, ఆ తర్వాత కొంచెం డైటింగ్ చేయడం వల్ల 14 రోజుల్లో 15 పౌండ్లు తగ్గానని తెలిపారు.

    ఒక యువతిగా ఉన్న నేను ఇలాంటి క్రేజీ విషయాలను ప్రయత్నించడం కేవలం సినిమా కోసమేనని, అంతేకానీ ఇలా చేయమని ఎవరూ నన్ను సిఫార్సు చేయలేదని స్పష్టం చేసింది. నేను అన్ని పౌండ్ల బరువు తగ్గడం అనేది పోషకాహార నిపుణుల పర్యవేక్షణలో మరియు ఒక వైద్యుడు సమక్షంలో జరిగింది. కానీ ఇది ఫన్ కాదు.

    అన్నే హాత్వే ఇదంతా చేయడానికి వెనుక కారణం హాలీవుడ్లో బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేసేందుకు వస్తున్న 'ది డార్క్ నైట రైజెస్' సినిమాలో క్యాట్ ఉమెన్ పాత్ర కోసం పాటు, ఎంతో ఛాలెంజింగ్‌గా తీసుకోని లెస్ మిసరబుల్స్ సినిమాలో పలుచని వేశ్య పాత్ర కోసమేనని చెప్పింది. సో నా అభిమానులైన మీరు కూడా నాకులాగే బరువుని తగ్గించుకోవడం కోసం పూర్తిగా భోజనం మానివేసే లాంటి పిచ్చి పనులు చేయవద్దని విజ్ఞప్తి చేసింది.

    తెలుగు వన్ఇండియా

    English summary
    Actress Anne Hathaway has urged young fans not to follow her example of taking up a drastic diet to lose weight. She confesses suffering after losing weight to thin prostitute in the “Les Miserables”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X