»   » పిల్లలను ఈ సినిమాకు తీసుకుని రావొద్దు...

పిల్లలను ఈ సినిమాకు తీసుకుని రావొద్దు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ మూవీ 'బేవాచ్' మూవీ త్వరలో విడుదలవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆమె సినిమా ప్రమోషన్లలో బిజీ అయిపోయారు. ఈ చిత్రం ద్వారా ప్రియాంక చోప్రా హాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్ హీరోగా సెత్‌ గొర్డాన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 1990లో టెలివిజన్‌ సిరీస్‌గా ప్రసారమై 'బేవాచ్‌' సిరీస్‌ ఆధారంగా అదే టైటిల్‌తో ఈ సినిమాను తీస్తున్నారు. ఇందులో ప్రియాంక విక్టోరియా లీడ్స్‌ అనే విలన్‌ పాత్రలో నటించింది.

జాక్‌ ఎఫ్రాన్‌, కెల్లీ రోహ్రబాక్‌, అలెజాండ్ర దాద్రిరియో తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్న ఈచిత్రం ప్రీమియర్‌ షోను ఆదివారం మియామీలో ప్రదర్శించారు.

ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా

ప్రీమియర్ షో అనంతరం ప్రియాంక అమెరికన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘బేవాచ్‌ షూటింగ్‌ను బాగా ఎంజాయ్‌ చేశాను. నా పాత్ర కోసం ఎంతో కష్టపడ్డాను. బేవాచ్‌ని సమ్మర్‌ ఫన్‌గా ఎంజాయ్‌ చేయచ్చు అని తెలిపారు.

పిల్లలను తీసుకురావొద్దు

పిల్లలను తీసుకురావొద్దు

బేవాచ్ సినిమాకు మీ పిల్లల్ని మాత్రం తీసుకుని రావొద్దు. ఇది పెద్దలకు మాత్రమే పరిమితమైన ఎంటర్టెన్మెంట్ మూవీ అని ప్రియాంక చోప్రా తెలిపారు.

అడల్ట్ మూవీ

అడల్ట్ మూవీ

సినిమా అడల్డ్ ఎంటర్టెన్మెంట్ కాన్సెప్టుతో తెరకెక్కింది. బికినీ సీన్లు, శృంగార సీన్లు, భారీ యాక్షన్ సీన్లతో సినిమాను భారీగా తెరకెక్కించారు.

ఇండియాలో

ఇండియాలో

అమెరికాలో ఈచిత్రం మే 25న ప్రేక్షకు ముందుకు రాబోతోంది. ఇండియాలో ‘బేవాచ్' మూవీ జూన్ 2న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Priyanka Chopra is excited for the release of her Hollywood debut Baywatch and she said she tried her hand at method acting to play the antagonist Victoria Leeds. Priyanka Chopra is excited for the release of her Hollywood debut Baywatch and she said she tried her hand at method acting to play the antagonist Victoria Leeds. By the way, don’t take your kids (sic)” Priyanka said at the Miami premiere which was live streamed on Facebook.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu