షూటింగ్ సెట్‌లో హీరోకి గాయాలు, సినిమా విడుదల ఆలస్యం
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్‌లో 'ఐరన్ మ్యాన్' సిరిస్ సినిమాలు బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐరన్ మ్యాన్ 3 సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. యాక్షన్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఐరన్ మ్యాన్ 3 సినిమాలో హీరోగా జూనియర్ రాబర్ట్ డౌనీ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సెట్‌లో జరిగిన చిన్న ప్రమాదంలో హీరో జూనియర్ రాబర్ట్ డౌనీ కాలి చీలమండలానికి కాస్త గాయమైనట్లు సమాచారం.
దీంతో జూనియర్ రాబర్ట్ డౌనీ కోలుకునేందుకు కాస్త సమయం పడుతుండడంతో షూటింగ షెడ్యూల్ మొత్తం చెడిపోవడమే కాకుండా.. సినిమా విడుదల కూడా ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాని నిర్మిస్తున్న మార్వెల్ స్డూడియోస్ అధికారంగా నార్త్ కాలిఫోర్నియాలోని విల్మింగ్టన్‌లో ఓ స్టంట్ సన్నివేశంలో నటిస్తుండగా హీరో జూనియర్ రాబర్ట్ డౌనీ కాలి చీలమండలానికి గాయమైందని తెలిపారు.
కాబట్టి ప్రొడక్షన్ షెడ్యూల్‌లో కాస్త ఆలస్యం అయ్యే సూచలను కనిపిస్తున్నాయన్నారు. ఈ సినిమాలో జూనియర్ రాబర్ట్ డౌనీతో పాటు జెన్నిత్ పాల్ట్రో, డాన్ చీడ్లే, గుయ్ పీర్స్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాని మే 2013న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











