డైరక్షన్ మాత్రమే కాదు...నిర్మాతగానూ ఆ హీరోయినే
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ డ్రూ బెరీమోర్ ఇప్పుడు డైరక్టర్ ఛైర్ లో కూర్చోబోతోంది. హౌ టు బి సింగిల్ అనే రొమాంటిక్ కామిడిని ఆమె డైరక్ట్ చేస్తోంది. న్యూ యార్క్ లోని కొందరు ప్రేమ కథల్ని, వారి బ్రేక్ అప్ లను ఎక్సప్లోర్ చేస్తానంటోంది. అలాగే ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయటమే కాదు నిర్మాతగానూ ఆమె ముందుకొస్తోంది. ఇక ఈ చిత్రం 2008 లో ఇదే టైటిల్ తో వచ్చిన ఓ నవల రైట్స్ కొని చేస్తోంది. ఇక ఇది మల్టి స్టోరీ నేరేషన్ అని చెప్తోంది. వాలెంటీన్స్ డే, హి ఈజ్ నాట్ దట్ ఇన్ టు యు వంటి చిత్రాల తరహాలో తన చిత్రం ఉండబోతోందని చెప్తోంది. ఈ ముప్పై ఆరేళ్ళ అందాల భామ ఇప్పుడు హీరోయిన్ గా ఛాన్స్ లు తగ్గటంలో ఇలా డైరక్టర్ అవతారం ఎత్తిందని హాలీవుడ్ రిపోర్టర్ వంటివి రాస్తున్నాయి. పిప్టీ ఫస్ట్ డేట్ తర్వాత ఆమె సినిమాలేవీ అంతగా ప్రేక్షకాదరణ నోచుకోలేదు.
hollywood drew barrymore how to be single romantic comedy డ్రూ బెరీ మోర్ రొమాంటిక్ కామిడి హౌ టు బి సింగిల్ 50 ఫస్ట్ డేట్స్


Click it and Unblock the Notifications