5వ గల్ప్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి దుబాయ్ ఆతిధ్యం
5వ గల్ఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ సంవత్సరం ఏప్రిల్ 10 - 16 తేదీన జరగనుంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఈసారి దుబాయ్ ఆతిధ్యం ఇవ్వనుంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సౌదీ ఆరేబియా, కువైట్, యూఎఈ, ఓమన్, కతార్, బహరేన్, యెమెన్, ఇరాక్ తదితర దేశాలకు సంబంధించిన సినిమాలను ప్రదర్శించనున్నారు. దుబాయ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఫీచర్, షార్ట్ ఫిల్మ్ కేటగిరిలలో కూడా వివిధ దేశాల నుండి ఎంట్రీలను ఆహ్వానిస్తున్నారు.
షార్ట్ ఫిల్మ్ కేటిగిరిలో కేవలం స్టూడెంట్స్ రూపొందించిన సినిమాలకు మాత్రమే ప్రవేశం ఉంది. ఈ షార్ట్ ఫిల్మ్ కేటగిరి విభాగంలో గెలుపొందిన ఫిల్మ్‌లకు గాను, హాఫ్ మిలియన్ దీనాలను ప్రైజ్ మనీగా ఇవ్వనున్నారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గోనాలనుకునే వారు వారియొక్క సబ్ మిషన్స్‌ని ఫిబ్రవరి 29 వరకు పంపించవచ్చు.


Click it and Unblock the Notifications











