twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫోర్బ్స్: వరల్డ్ హయ్యెస్ట్ పేయిడ్ యాక్టర్స్, ఇండియా నుండి నలుగురు.. (లిస్ట్)

    By Bojja Kumar
    |

    లాస్ ఏంజిల్స్: ప్రపంచ ప్రఖ్యాత మేగజైన్ వివిధ రంగాల నుండి సేకరించిన డాటా ఆదారంగా ప్రతి ఏటా వివిధ విభాగాలకు సంబంధించి టాప్ లిస్టులను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోని ధనవంతులు, ప్రపచంలో అత్యధికంగా సంపాదిస్తున్న వ్యక్తులు, అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న యాక్టర్లు, హీరోయిన్లు... ఇలా వివిధ అంశాలకు సంబంధించిన లిస్టులను రిలీజ్ చేస్తూ ఉంటుంది.

    ఇటీవల వరల్డ్ హయ్యెస్ట్ పేయిడ్ హీరోయిన్ల లిస్టులను రిలీజ్ చేయగా.... హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్ 300 కోట్ల పైచిలుకు సంపాదనతో అగ్రస్థానంలో ఉండగా... ఇందులో ఇండియా నుండి దీపిక పదుకోన్ కూడా స్థానం దక్కించుకుంది.

    తాజాగా వరల్డ్ హయ్యెస్ట్ పేయిడ్ యాక్టర్స్ లిస్టును కూడా ఫోర్బ్స్ సంస్థ రిలీజ్ చేసింది. మొత్తం 20 మందితో కూడిన ఈ టాప్ లిస్టులో ఇండియా నుండి నలుగురు స్టార్స్ కూడా ఉండటం గమనార్హం. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో..

    డ్వేన్ జాన్సన్

    డ్వేన్ జాన్సన్

    హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ ఈ ఏడాది నెం.1 స్థానం దక్కించుకున్నాడు. అతని సంపాదన 64 మిలియన్ డాలర్లు. మన లెక్క ప్రకారం రూ. 430 కోట్లు. డబ్ల్యుడబ్ల్యుఇ ఫైటర్ అయిన డ్వేన్ జాన్సన్ తర్వాత సినిమా నటుడిగా మారి బాగానే సంపాదిస్తున్నారు.

    జాకీ చాన్

    జాకీ చాన్

    61 మిలియన్ డాలర్ల సంపాదనతో జాకీ చాన్ రెండో స్థానంలో ఉన్నారు. మన లెక్క ప్రకారం ఇది రూ. 410 కోట్లు.

    మాట్ డామన్

    మాట్ డామన్

    మరో హాలీవుడ్ నటుడు మాట్ డామన్ 55 మిలియన్ డాలర్ల సంపాదనతో మూడో స్థానంలో ఉన్నారు. మన లెక్క ప్రకారం ఇతని సంపాదన రూ. 370 కోట్లు.

    టామ్ క్రూయిజ్

    టామ్ క్రూయిజ్

    53 మిలియన్ డాలర్ల సంపాదనతో టామ్ క్రూయిజ్ నాలుగో స్థానంలో ఉన్నారు. అతని సంపాదన మన లెక్క ప్రకారం రూ. 355 కోట్లు.

    జానీ డెప్

    జానీ డెప్

    48 మిలియన్ డాలర్ల సంపాదనతో జానీ డెప్ ఐదో స్థానంలో ఉన్నారు. మన కరెన్సీలో రూ. 322 కోట్లు.

    బెన్ అఫ్లెక్

    బెన్ అఫ్లెక్

    43 మిలియన్ డాలర్ల సంపాదనతో బెన్ అఫ్లెక్ ఆరో స్థానంలో ఉన్నారు. అంటే రూ. 288 కోట్లన్నమాట.

    విన్ డీసెల్

    విన్ డీసెల్

    35 మిలియన్ డాలర్ల సంపాదనతో విన్ డీసెల్ ఏడో స్థానంలో నిలిచాడు. మన లెక్క ప్రకారం రూ. 235 కోట్లు.

    షారుక్ ఖాన్

    షారుక్ ఖాన్

    33 మిలియన్ డాలర్ల సంపాదనతో షారుక్ ఖాన్ ఎనిమిదోస్థానంలో ఉన్నాడు. మన లెక్క ప్రకారం రూ. 221 కోట్లు.

    రాబర్ట్ డౌనీ జూనియర్

    రాబర్ట్ డౌనీ జూనియర్

    గతేడాది నెం.1 స్థానంలో రాబర్ట్ డౌనీ జూనియర్ ఈ సారి 33 మిలియన్ డాలర్ల సంపాదనతో 9వ స్థానానికి పడిపోయాడు.

    అక్షయ్ కుమార్

    అక్షయ్ కుమార్

    మరో ఇండియన్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ సారి 10వ స్థానం దక్కించుకున్నాడు. అతని సంపాదన 31.5 మిలియన్ డాలర్లు. అంటే రూ. 211 కోట్లు.

    బ్రాడ్ పిట్

    బ్రాడ్ పిట్

    ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ 31.5 మిలియన్ డాలర్ల సంపాదనతో 11వ స్థానంలో ఉన్నాడు.

    ఆడమ్ సాండ్లర్

    ఆడమ్ సాండ్లర్

    30 మిలియన్ డాలర్ల సంపాదనతో ఆడమ్ సాండ్లర్ 12వ స్థానంలో ఉన్నాడు. అంటే రూ. 201 కోట్లు.

    మార్క్ వాల్బర్గ్

    మార్క్ వాల్బర్గ్

    30 మిలియన్ డాలర్ల సంపాదనతో మార్క్ వాల్బర్గ్ 13 వస్థానంలో ఉన్నాడు.

    సల్మాన్ ఖాన్

    సల్మాన్ ఖాన్

    బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ 28.5 మిలియన్ డాలర్ల సంపాదనతో 14వ స్థానంలో ఉన్నాడు. సల్మాన్ సంపాదన రూ. 191 కోట్లు.

    లియోనార్డో డికాప్రియో

    లియోనార్డో డికాప్రియో

    27 మిలియన్ డాలర్ల సంపాదనతో లియోనార్డో డికాప్రియో 15వ స్థానంలో ఉన్నాడు. మన కరెన్సీలో రూ. 181 కోట్లు.

    క్రిస్ ప్రాట్

    క్రిస్ ప్రాట్

    హాలీవుడ్ నటుడు క్రిస్ ప్రాట్ 26 మిలియన్ డాలర్ల సంపాదనతో 16వ స్థానంలో ఉన్నాడు. మన కరెన్సీలో 174 కోట్లు.

    విల్ స్మిత్

    విల్ స్మిత్

    హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ 20.5 మిలియన్ డాలర్ల సంపాదనతో 17వ స్థానంలో ఉన్నాడు. అతని సంపాదన రూ. 137 కోట్లు.

    అమితాబ్

    అమితాబ్


    అమితాబ్ బచ్చన్ 20 మిలియన్ డాలర్ల సంపాదనతో 18వ స్థానంలో నిలిచారు. అంటే 134 కోట్లు.

    మాథ్యూ

    మాథ్యూ

    హాలీవుడ్ నటుడు మాథ్యూ 18 మిలియన్ డాలర్ల సంపాదనతో 19 వస్థానంలో ఉన్నాడు.

    హారిసన్ ఫోర్డ్

    హారిసన్ ఫోర్డ్

    హాలీవుడ్ సీనియర్ యాక్టర్ హారిసన్ ఫోర్డ్ 15 మిలియన్ డాలర్ల సంపాదనతో 20వ స్థానంలో ఉన్నారు.

    English summary
    Former WWE fighter turned actor, Dwayne Johnson, popularly known as 'The Rock' has emerged as the world's highest paid actor surpassing stars like Jackie Chan, Matt Damon, Tom Cruise and Johnny Depp, his next close contenders in the list.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X