ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ లవ్ ఎఫైర్‌కు కారకుడిని నేనే: ది రాక్
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కొంతకాలంగా అమెరికన్ గాయకుడు, నటుడు నిక్ జోనాస్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంట సహజీవనం చేస్తున్నట్లు హాలీవుడ్ మీడియా సైతం కోడై కూస్తోంది. తన ప్రియుడిని వెంటేసుకుని ప్రియాంక ఇండియాలో పర్యటించడం కూడా ఈ వార్తలకు మరింత బాలాన్ని ఇచ్చింది.
అయితే తమ రిలేషన్ గురించి అటు ప్రియాంక కానీ, ఇటు నిక్ జోనాస్ కానీ ఇప్పటి వరకు అఫీషియల్‌గా ప్రకటించలేదు. అయితే వీరి వ్యవహారం గురించి హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్(ది రాక్) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. వీరిద్దరి మధ్య సంబంధం ఏర్పడటానికి మూలకారకుడిని తానే అని తెలిపాడు.

ప్రియాంక చోప్రా, డ్వేన్ జాన్సన్ కలిసి హాలీవుడ్ మూవీ 'బేవాచ్'లో నటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా నిక్ జోనాస్‌తో కలసి 'జుమాంజీ' చిత్రానికి పని చేశాడు. ఇద్దరికీ అతడు కామన్ ఫ్రెండ్. ఓ పార్టీలో ఒకరికొకరిని పరిచయం చేసింది తానే జాన్సన్ తెలిపారు.
తన వల్ల పరిచయం అయిన ప్రియాంక, నిక్ ఇపుడు చాలా సంతోషంగా ఉన్నారు, వారి జంటను చూస్తుంటే ముచ్చటేస్తోంది. వారి మధ్య ప్రేమ పుట్టడానికి తాను కారణం అయినందుకు హ్యీగా ఫీలుతున్నాను అన్నారు.


Click it and Unblock the Notifications











