For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయనున్న హాలీవుడ్ స్టార్

    By Bojja Kumar
    |

    హాలీవుడ్ న‌టుడు, మాజీ రెజ్ల‌ర్ డ్వేన్ జాన్స‌న్ (ది రాక్) అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నసంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఈ విషయమై స్పందించారు.

    అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని, అయితే అది ఇప్పుడే కాదని తెలిపారు. తాను 2024లో అమెరికా అధ్య‌క్షుడి ప‌ద‌వికి పోటీచేసే అవకాశం ఉందని తెలిపారు. ఓ హాలీవుడ్ పత్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విష‌యాన్ని చెప్పారు.

    ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నా

    ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నా

    ప్రస్తుతం తాను సినిమాలు, ఇతర కమిట్మెంట్లతో బిజీగా ఉన్నానని, 2018 నుంచి 2021 వ‌ర‌కు తాను పూర్తి చేయాల్సిన సినిమాలు, పనులు చాలా ఉన్నాయని డ్వేన్ జాన్సన్ తెలిపారు. అవి పూర్తయిన తర్వాత 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్లాన్ చేసుకుంటానన్నారు.

     జాన్సన్‌కు అనుకూలంగా సర్వే

    జాన్సన్‌కు అనుకూలంగా సర్వే

    డ్వేన్ జాన్స్ అమెరికా రాజ‌కీయాల్లో అడుగుపెడ‌తార‌న్న వార్త‌లు నేపథ్యంలో వాషింగ్ట‌న్ పోస్ట్ ప‌త్రిక ఈ అంశంపై ఓ స‌ర్వే కూడా నిర్వ‌హించింది. ఆ స‌ర్వేలో డ్వేన్ గెలిచే అవ‌కాశాలు బాగానే ఉన్న‌ట్లు తేలింది.

     జాన్సన్‌లో ఆసక్తి పెంచిన సర్వే

    జాన్సన్‌లో ఆసక్తి పెంచిన సర్వే

    ‘వాషింగ్టన్ పోస్ట్' సర్వే ఫలితాలు చూసిన త‌ర్వాత తన‌కు రాజ‌కీయాల్లోకి రావాల‌న్న ఆస‌క్తి మ‌రింత పెరిగింద‌ని, ప్రజల కోరుకుంటున్నారు కాబట్టే తాను ఈ నిర్ణయం తీసుకున్నాను అని డ్వేన్ అన్నారు.

    ఈ విషయంలో సీరియస్‌గా ఆలోచిస్తాను

    ఈ విషయంలో సీరియస్‌గా ఆలోచిస్తాను

    రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని నేనెప్పుడూ బ‌హిరంగంగా చెప్ప‌లేదు. కానీ ప్ర‌జ‌లు న‌న్ను రావాల‌ని కోరుకుంటున్న‌ారు. వారి కోసమైనా దీని గురించి నేను సీరియ‌స్‌గా ఆలోచిస్తాను' అని డ్వేన్ జాన్సన్ తెలిపారు.

    English summary
    Actor and former professional wrestler Dwayne "The Rock" Johnson is considering entering a different ring, the political ring. In an interview on the Ellen Degeneres show earlier this week, Johnson confirmed rumors that he may run for president. "I am seriously considering it, yes," Johnson said after being asked if he was serious about a bid for the White House.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X