Don't Miss!
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్‌పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయనున్న హాలీవుడ్ స్టార్
హాలీవుడ్ నటుడు, మాజీ రెజ్లర్ డ్వేన్ జాన్సన్ (ది రాక్) అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నసంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఈ విషయమై స్పందించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని, అయితే అది ఇప్పుడే కాదని తెలిపారు. తాను 2024లో అమెరికా అధ్యక్షుడి పదవికి పోటీచేసే అవకాశం ఉందని తెలిపారు. ఓ హాలీవుడ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు.
ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నా
ప్రస్తుతం తాను సినిమాలు, ఇతర కమిట్మెంట్లతో బిజీగా ఉన్నానని, 2018 నుంచి 2021 వరకు తాను పూర్తి చేయాల్సిన సినిమాలు, పనులు చాలా ఉన్నాయని డ్వేన్ జాన్సన్ తెలిపారు. అవి పూర్తయిన తర్వాత 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్లాన్ చేసుకుంటానన్నారు.
జాన్సన్‌కు అనుకూలంగా సర్వే
డ్వేన్ జాన్స్ అమెరికా రాజకీయాల్లో అడుగుపెడతారన్న వార్తలు నేపథ్యంలో వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఈ అంశంపై ఓ సర్వే కూడా నిర్వహించింది. ఆ సర్వేలో డ్వేన్ గెలిచే అవకాశాలు బాగానే ఉన్నట్లు తేలింది.
జాన్సన్లో ఆసక్తి పెంచిన సర్వే
‘వాషింగ్టన్ పోస్ట్' సర్వే ఫలితాలు చూసిన తర్వాత తనకు రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి మరింత పెరిగిందని, ప్రజల కోరుకుంటున్నారు కాబట్టే తాను ఈ నిర్ణయం తీసుకున్నాను అని డ్వేన్ అన్నారు.
ఈ విషయంలో సీరియస్‌గా ఆలోచిస్తాను
రాజకీయాల్లోకి వస్తానని నేనెప్పుడూ బహిరంగంగా చెప్పలేదు. కానీ ప్రజలు నన్ను రావాలని కోరుకుంటున్నారు. వారి కోసమైనా దీని గురించి నేను సీరియస్‌గా ఆలోచిస్తాను' అని డ్వేన్ జాన్సన్ తెలిపారు.