కాలిఫోర్నియాలో భూకంపం.. ప్రాణాలు అరచేతిలో అంటూ హాలీవుడ్ సినీతారల ట్వీట్స్
అమెరికాలోని పలు నగరాల్లో భారీగా భూప్రకంపనలు చోటుచేసుకొన్నాయి. అమెరికా కాలమానం ప్రకారం జూలై 30 తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో లాస్ ఎజెంలెస్, కాలిఫోర్నియాలో భూకంపం చోటుచేసుకొన్నది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.2గా నమోదైంది. ఈ భూకంపంపై హాలీవుఢ్ సెలబ్రిటీలు ట్వీట్ చేసి తమ ఆందోళనను, భయాన్ని వ్యక్తం చేశారు.
అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించిన ప్రకారం గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవింంచిందని పేర్కొన్నది. ఖోల్ కర్దాషియాన్ తన ట్విట్టర్ ఖాతాలో భూకంప ప్రమాద సమాచారాన్ని వెల్లడించారు. భగవంతుడా.. భూకంప తీవ్రత 4.5 కంటే ఎక్కువ కనిపించింది. చాలా భయంతో వణికిపోయాం. నా బెడ్‌రూంలో వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి అని ట్వీట్ చేశారు.

మరో హాలీవుడ్ సెలబ్రిటీ క్రిస్సీ తీజెన్ స్పందిస్తూ.. భూకంపం సంభవించే సమయానికి నా బిడ్డలు నా చేతిలోనే ఉన్నారు. కుటుంబ సభ్యులందరం ఒకే చోటకు వచ్చి పిల్లలకు రక్షణగా నిలిచాం అని పేర్కొన్నారు.
పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ.. ఒక్కసారిగా ఇళ్లంతా షేక్ అయింది. ఆ క్షణంలో ఏ చేయాలో అర్ధం కాలేదు. భయంతో వణికిపోయాం. మా పెంపుడు కుక్కలు ఓ రకమైన భయంతో అరుపులు పెట్టాయి. 2020 సంవత్సరం చాలా దారుణంగా ఉంది. ఏ సమయంలో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి కనిపిస్తుందని పలువురు తమ ట్వీట్లలో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











