twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏంటా డ్రస్సు ఛండాలంగా..అందుకే అలా అన్నారు..!!

    By Nageswara Rao
    |

    25సంవత్సరాలు వయసు కలిగిన లేడీగాగా ఎప్పుడు కూడా వార్తల్లో వ్యక్తి గా ఉండడానికి మాత్రమే ఇష్టపడతారు. అందుకేనేమో నార్త్ లండన్‌లో జరిగిన బీట్స్ ఆడియో పార్టీకి విచిత్రమైన వేషధారణలో వచ్చి యావత్ అభిమానులను మాత్రమే కాకుండా అక్కడున్న వారందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. లేడీ గాగా ఈ ఆడియో పార్టీలో ధరించిన డ్రస్సుని మీరు ఈ ప్రక్క చిత్రంలో చూడొచ్చు. దీనిని చూస్తుంటే ఫ్యాషన్ అనే పదం ఈమె నుండే పుట్టిందేమోనని అనిపిస్తుంది. ఈతరహా మాదిరి డ్రస్సు గతంలో లేడీగాగా రెండు సార్లు ధరించడం జరిగింది.

    మొదటిది జులైలో మోనిస్టర్ బాల్ టూర్‌లో తెల్లని విగ్గు ధరించగా, రెండవది అక్టోబర్‌‌లో న్యూయార్క్‌లో జరిగిన స్టేజి ఫెర్పామెన్స్‌లో ధరించారు. ప్రక్క చిత్రంలో మీరు గనుక లేడీగాగాని చూసినట్లైతే తన జుట్టుపై నలుపు కలర్ విగ్గుని ధరించి, తన అందాలు మొత్తం అభిమానులకు కనిపించేటట్లు డ్రస్సు ధరించడంతో పాటు, హై హీల్స్‌ని ధరించడం జరిగింది. ఇక తన చేతిలో ఓ అందమైన పెయింటింగ్‌తో అక్కడున్నవారిని అలరించింది.

    ఆమె ధరించిన డ్రస్సుని చూసిన అభిమానులు లేడీగాగా హోటల్‌కు వెళ్లిపోయేవరకు అక్కడే ఉండి ఆమె కరచాలనానికి పోటీ పడడం జరిగింది. ఇక ఆమె చేతులకు రాయల్ లుక్ వచ్చేందుకు గాను బ్లాక్ బ్లౌజ్‌లను ధరించడం జరిగింది. ఇలాంటి డ్రస్సులు ధరించడం వల్లనే కాబోలు ఇటీవల కాలంలో ఓ ప్రముఖ టివీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో మ్యూజిక్ మొగల్ సైమన్ కోవెల్ మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న సింగర్స్‌లలో లేడీగాగాని బోరింగ్ సింగర్‌గా అభివర్ణించడం జరిగింది. అందుకు గల కారణాలను తెలియజేస్తూ లేడీగాగా గతంలో విడుదల చేసిన 'యునీడ్ టివి' ఆల్బమ్‌లో ఉన్న పాటలను గనుక గమనిస్తే నేను ఎందుకు వీరిని బోరింగ్ సింగర్స్‌గా పేర్కోన్నానో మీకు అర్దం అవుతుందని అన్నారు.

    English summary
    Eccentric star revisits crazy style in wig dress for London party
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X