పదో బిడ్డకు తండ్రి కాబోతున్న హలీవుడ్ హీరో..
హాలీవుడ్ యాక్టర్ ఎడ్డీ మర్ఫీ పదో బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. తన లివింగ్ పార్ట్‌నర్ పైగే బుచర్ రెండోసారి గర్భవతి అయిందనే విషయాన్ని హీరో ఎడ్డీ సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నారు.
ఎన్నో ఏళ్లుగా సహజీవనం చేస్తున్న పైగే బచ్చర్, ఎడ్డీ మర్ఫీ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు హాలీవుడ్ మీడియా ఇటీవల ఓ కథనంలో పేర్కొన్నది. ఆస్ట్రేలియాకు చెందిన నటి పైగే బుచర్‌కు 39 ఏళ్లు కాగా, ఎడ్డీ మర్ఫీకి 57 ఏళ్లు.

ఎడ్డీ మర్ఫీతోపాటు గర్భంతో ఉన్న పైగే బుచర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
గతంలో వివిధ జీవిత భాగస్వాములతో ఎడ్డీ మర్ఫీ ఎనిమిది మంది పిల్లలను కన్నారు. అతడికి పెద్ద కుమారుడికి ప్రస్తుతం 29 ఏళ్ల వయసు ఉండటం గమనార్హం.


Click it and Unblock the Notifications











