ప్రేమను తెలియజేయడం కోసం పిచ్చి ప్రయత్నం చేసిన సింగర్
ప్రేమ అనేది పలు రకాలు అన్నారు పెద్దలు. ప్రేమంచిన వారితో మనం మన ప్రేమని పలు రకాలుగా వ్యక్తం పరుస్తాం..ఇందులో భాగంగా హాలీవుడ్ నటుడు తన ప్రేమని ప్రేమసితో వెరైటీగా పంచుకున్నాడు. పెనిలోప్ క్రూజ్ సోదరుడు ఎడోర్డొ క్రూజ్ చాలా రోజులు నుంచి ఇవా లంగోరియాతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. తన ప్రేమని ఇవా లంగోరియాకి తెలియ జేయాలనే ఉద్దేశ్యంతో ఇవా లంగోరియా పేరుని టాటూ రూపంలో తన చేతి మీద వేయించుకోని ఇవా లంగోరియాని ఆశ్చర్యపరిచాడు.
ఈజంట గత కొన్ని నెలల క్రితం నుండి సహాజీవనంతో పాటు డేటింగ్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. దాంతో మొట్టమొదటి సారిగా గతవారం పబ్లిక్ ముందుకి రావడం జరిగింది. దాంతో వీరిద్దరి మద్య ఉన్నటువంటి సంబంధానికి గట్టి బలం చేకూర్చడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు కొత్తగా మన స్పానిష్ సింగర్ టాటూ రూపంలో తన పేరుని తన చేతిమీద వేసుకోవడంతో అందరి దృష్టి ఇప్పుడు వీరి మీద పడింది.
ఇవా లంగోరియా భర్త బాస్కెట్ బాల్ ప్లేయర్ టోనీ పార్కర్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత ఇవా లంగోరియా బాగా స్వేచ్చగా తిరగడం ప్రారంభించారని సమాచారం. మొన్నటి మొన్న జరిగినటువంటి సూపర్ బౌల్ పార్టీలో కూడా వీరిద్దరి సాన్నిహిత్యం బాగా పెరిగిందని సమాచారం. ఈ సూపర్ బౌల్ పార్టీలో ఇద్దరూ ఒకరినోకరు విడిపోలేనంత గాఢంగా కౌగిలించుకోని మరీ గంటల కొద్ది ముద్దులు పెట్టుకున్నారని అక్కడ ఉన్నవారంతా వివరించడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా తన భర్త నుండి విడాకులు తీసుకున్న తర్వాత వెంటనే ఈజంట ఇద్దరూ కలసి లగ్జరీ అపార్ట్ మెంట్‌లో గడిపారని సమాచారం.


Click it and Unblock the Notifications











