twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాలీవుడ్ లెజెండ్ డోరిస్ డే కన్నుమూత

    |

    హాలీవుడ్ లెజెండరీ యాక్ట్రెస్ డోరిస్ డే కన్నమూశారు. ఆమె వయసు 97 సంవత్సరాలు. ఏజ్ రిలేటెడ్ సమస్యలతో ఆమె సోమవారం కాలిఫోర్నియాలోని తన నివాసంలో కన్ను మూశారు. హాలీవుడ్ గోల్డెన్ ఎరాకు చెందిన సినీయర్ నటిగా ఆమెను సినీ ప్రముఖులు పేర్కొంటున్నారు.

    egendary actress Doris Day has died

    1950, 60ల్లో ఆమె హాలీవుడ్ ఇండస్ట్రీని మకుటం లేని మహారాణిగా ఏలారు. పిల్లో టాక్, దట్ టచ్ ఆఫ్ మింక్, ది మ్యాన్ హూ న్యూ టూ మచ్ లాంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. డోరిస్ డే మృతి పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

    1922లో జన్మించిన డోరిస్ డే... వాస్తవానికి డాన్సర్ కావాలనుకున్నారు. అయితే ఓ యాక్సిడెంటులో ఆమె కుడి కాలు విరిగడంతో తన కలను నిజం చేసుకోలేక పోయారు. 15 ఏళ్ల వయసులోనే సింగర్‌గా కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత నటన వైపు అడుగులు వేశారు.

    egendary actress Doris Day has died

    ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ మూవీ ది మ్యాన్ హూ న్యూ టూ మచ్ మూవీతో ఆమె ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అయితే డోరిస్ డే తన కెరీర్లో ఒక్క ఆస్కార్ కూడా అందుకోలేదు. 1960 ఒకసారి ఆమె నటించి పిల్లో టాక్ అనే చిత్రాకి ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయ్యారు.

    డోరిస్ తన జీవితంలో ఆమె ఎన్నో అవార్డులు, సత్కారాలు అందుకున్నారు. 2004లో ప్రెసిడెంటల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్, 2008లో జర్మనీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అందుకున్నారు. ఆమె చివరి ఆల్బం 'మై హార్ట్' 2011లో విడుదలై యూకెలో నెం1గా నిలిచింది.

    English summary
    Legendary actress Doris Day has died. She was 97. A popular screen icon of her era, Day ruled the industry in the 1950s and 60s with her films such as Pillow Talk, That Touch of Mink and The Man Who Knew Too Much, breathed her last on Monday at her Carmel Valley home in California, US media organisations said quoting her animal welfare foundation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X