దేశాధ్యక్షుడిపై ఎన్నికల్లో పోటీ చేయనున్న పోర్న్ స్టార్
వచ్చే ఏడాది రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ పోర్న్ ఎలెనా బెర్కోవా ప్రకటించారు.
హాలీవుడ్ నిర్మాత హార్వీ వెయిన్‌స్టన్ సెక్స్ స్కాండల్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రష్యాకు చెందిన మాజీ పోర్న్ స్టార్ ఒకరు వచ్చే ఏడాది ఎన్నికల బరిలో దిగుతానని, దేశాధ్యక్షుడు పుతిన్‌పై పోటీ చేస్తానని ప్రకటించారు.
వాయువ్య రష్యాలోని ముర్మాన్స్క్ ప్రాంతానికి చెందిన ఎలెనా బెర్కోవా తన భవిష్యత్ ప్లాన్స్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్టు చేశారు. ఈవిడ గతంలో సోచి మేయర్ గా కూడా నిలబడింది. 32 సంవత్సరాల ఎలెనా బెర్కోవా ఇద్దరు పిల్లలకు తల్లి.

హార్వీ వెయిన్‌స్టన్ లాంటి వ్యక్తులతో హరాస్మెంట్
తాను చట్ట సభల్లోకి వస్తే సెక్సువల్ హరాస్మెంట్ చేసిన వారికి మరణ శిక్ష వేయాలనే ప్రతిపాదనను పరిచయం చేస్తానని, ఎందుకంటే గతంలో తాను హార్వీ వెయిన్‌స్టన్ లాంటి వ్యక్తులతో చాలా హరాస్మెంట్ ఎదుర్కొన్నాను అని ఎలెనా బెర్కోవా తెలిపారు.

మహిళలకు అనుకూలంగా వాగ్ధానాలు
అంతే కాకుండా పురుషులు విడాకులు తీసుకోవడం కష్టతరం చేస్తాను, పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్ ప్రవేశ పెడతాను, 40 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పొడవుగల స్కర్టులు వేసుకోవడాన్ని ఒకనేరంగా భావించేలా చేస్తాను అంటూ... అమ్మడు చాలా విషయాలు ఈ వీడియోలో చెప్పుకొచ్చింది.

కీలకమైన నిర్ణయం
ఇటీవల రష్యాలో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే మహిళల సంఖ్య పెరిగింది. వారి బాటలో నడుస్తూ ఎలెనా బెర్కోవా కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని ఇటీవలే నిర్ణయం తీసుకుంది.

మిశ్రమ స్పందన
ఎలెనా బెర్కోవాను సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారి సంఖ్య లక్షల్లో ఉంది. ఆమె అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పగానే ఆమె ఫాలోవర్స్ నుండి మిశ్రమ స్పంద వస్తోంది.


Click it and Unblock the Notifications











