»   » షాకింగ్: ఆ ఇద్దరు హీరోయిన్లు లెస్బియన్లు, పెళ్లితో సంచలనం!

షాకింగ్: ఆ ఇద్దరు హీరోయిన్లు లెస్బియన్లు, పెళ్లితో సంచలనం!

Posted By:
Subscribe to Filmibeat Telugu
ఆ ఇద్దరు హీరోయిన్లు లెస్బియన్లా ?

ఒక ఆడ, ఒక మగ పెళ్లి చేసుకుంటే..... భార్య భర్తలు అంటారు. అదే ఆడ, ఆడ పెళ్లి చేసుకుంటే వారిని ఏమనాలి? భార్య భార్యలనాలేమో?. ఇపుడు హాలీవుడ్లో చోటు చేసుకున్న ఓ పెళ్లి విషయంలో చాలా మందిలో ఇలాంటి కన్‌ఫ్యూజనే ఏర్పడింది. స్వలింగ సంపర్కులైన ఇద్దరు హీరోయిన్లు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. వారి సీక్రెట్ మ్యారేజ్ విషయం తాజాగా బయటకు రావడంతో అంతా షాకవుతున్నారు.

 ఎవరా ఇద్దరు హీరోయిన్లు?

ఎవరా ఇద్దరు హీరోయిన్లు?

పాపులర్ హాలీవుడ్ మూవీ సిరీస్ ‘ఎక్స్‌మెన్'తో పాటు పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఎలెన్ పేజ్ స్విలింగ సంపర్క వివాహం చేసుకుని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. మరో నటి ఎమ్మా పోర్ట్‌నర్‌ను ఆమె పెళ్లాడారు. ఎలెజ్ పేజ్ వయసు 30 సంవత్సరాలు.

ఆమె పెళ్లాడిన మరో నటి ఈవిడే

ఆమె పెళ్లాడిన మరో నటి ఈవిడే

నటి, డాన్సర్ అయిన ఎమ్మా పోర్ట్‌నర్‌తో ఎలెజ్ పేజ్ కొంతకాలంగా లవ్ రిలేషన్‌షిప్‌లో ఉంది. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎలెజ్ పేజ్ గతంలోనే ప్రకటించారు. ఇపుడు ఏకంగా ఎమ్మా పోర్ట్‌నర్‌‌ను ఆమె పెళ్లాడినట్లు ప్రకటించడం హాట్ టాపిక్ అయింది.

సోషల్ మీడియా ద్వారా

సోషల్ మీడియా ద్వారా

‘‘నమ్మలేకపోతున్నా.. ఎక్స్‌ట్రార్డినరీ ఉమెన్‍ ఇకపై నా భార్య, చాలా ఆనందంగా ఉంది అంటూ...... వెడ్డింగ్ రింగ్ ఫోటోను షేర్ చేస్తూ ఎలెన్ పేజ్ ఒక పోస్టు చేశారు.

 ఇద్దరూ భార్య భార్యలయ్యారు

ఇద్దరూ భార్య భార్యలయ్యారు

ఎమ్మా పోర్ట్‌నర్‌ కూడా ఎలెన్ పేజ్ తన వైఫ్‌గా పేర్కొంటూ .... సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఒకరినొకరు భార్యగా పిలుచుకుంటున్నారు కాబట్టి ఈ జంటను ‘భార్య భర్యలు' అని పిలవాలేమో?

 ఇద్దరూ లెస్బియన్లే

ఇద్దరూ లెస్బియన్లే

ఎలెన్ పేజ్, ఎమ్మా పోర్ట్‌నర్ ఇద్దరూ లెస్పియన్లే. వీరికి మగవారితో శృంగారం చేయడం ఇష్టం ఉండదు. గతంలో ఎలెన్ పేజ్ ఇద్దరు నటీమణులతో ప్రేమ వ్యవహారం నడిపింది. వారితో సహజీవనం చేసింది. అయితే వారితో ఎఫైర్ పెళ్లి వరకు రాలేదు.

 స్వలింగ సంపర్కుల్లోనూ బ్రేకప్స్ ఉంటాయి

స్వలింగ సంపర్కుల్లోనూ బ్రేకప్స్ ఉంటాయి

స్వలింగ సంపర్కుల్లో కూడా విడిపోవడం, బ్రేకప్ చేసుకోవడం లాంటివి ఉంటాయి. ఎలెన్ పేజ్ గతంలో హాలీవుడ్ నటి సమంత థామస్‌తో రెండేళ్లు సహజీవనం చేసింది. తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయ విబేధాలు వచ్చి విడిపోయారు.

 మనకు ఆశ్చర్యం... అక్కడ ఇదంతా కామన్

మనకు ఆశ్చర్యం... అక్కడ ఇదంతా కామన్

ఇలా ఆడ ఆడ పెళ్లి చేసుకోవడం, మగ మగ లవ్ చేసుకోవడం ఇండియన్స్‌కు విచిత్రమే కానీ..... అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఇదంతా మామూలే. కొత్తగా పెళ్లి చేసుకున్న ఎలెన్ పేజ్, ఎమ్మా పోర్ట్‌నర్ కపుల్‌కు చాలా మంది అభినందనలు బెస్ట్ విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

 నటిగా మంచి పేరుంది

నటిగా మంచి పేరుంది

ఎలెన్ పేజ్..... వ్యక్తిగత జీవితం గురించి పక్కన పెడితే హాలీవుడ్లో నటిగా ఆమెకు మంచి పేరుంది. ఎక్స్‌ మెన్‌ సిరీస్ చిత్రాలతో పాటు, ఇన్‌సెప్షన్‌, జునో లాంటి పలు హాలీవుడ్ చిత్రాల్లో నటనకు గాను ఆమె మంచి పేరు తెచ్చుకుంది.

English summary
Ellen Page has secretly married her girlfriend Emma Portner, just six months after going public with their romance. The actress, 30, revealed the happy news in a series of Instagram posts on Wednesday afternoon, which showed the couple kissing and showing off their matching wedding bands.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X