గే వివాహంతో, చిన్నారి దత్తత ఆశలపై నీళ్లు

By Kuladeep

ప్రముఖ పాప్ సింగర్ 'మెగాస్టార్' 62 ఏళ్ల సర్ ఎల్టన్ జాన్ తన స్నేహితుడు 46 ఏళ్ల డేవిడ్ ఫుర్నిష్ ని 'గే' చట్టం ద్వారా వివాహం చేసుకున్నాకా ఓ అనాధను దత్తతకు తీసుకొని వారిని పెంచాలనుకున్న ఆశలపై ఉక్రెయిన్ దేశ చట్టం నీళ్లు చల్లింది. ఇంగ్లాడ్ లో గే వివాహానికి అనుమతి లభించాకా మొదట గే వివాహం చేసుకున్న వారిగా వార్తలకు ఎక్కిన ఎల్టన్ జాన్, డేవిడ్ ఫుర్నిష్ ఇటీవల ఉక్రెయిన్ దేశానికి వెళ్లినప్పుడు ఓ అనాధ బాలున్నిదత్తతకు తీసుకోవాలని ఆశ పడ్డారు. కానీ ఉక్రెయిన్ దేశ చట్టం ప్రకారం దత్తత తీసుకోవాలనుకున్న వారు వివాహితులై వుండాలి. మరిందులో అడ్డేం వుంది ఆయన సలక్షణంగా తన స్నేహితున్ని వివాహమాడారు కదా అనుకుంటున్నారా. చేసుకున్నాడు కానీ అసలు చిక్కు అక్కడే వచ్చింది. ఉక్రెయిన్ దేశంలో 'గే' వివాహం చట్ట విరుద్ధం. దీంతో ఈయన గారి ఆశలు అడి ఆశలయ్యాయి. అంతే కాదు దత్తత తీసుకోదలచిన వారి వయసు, ఆ చిన్నారి వయసు కంటే 45 ఏళ్లు పైన ఉండకూడదు. మరి ఈయన గారి వయసేమో 62 ఆయే. ఇన్ని అడ్డంకుల మధ్య ఆయన ఆశలు తీరడం గగనమే...కానీ ఇదంతా విన్న వారు మాత్రం ఏం ఇంగ్లాండులో మాత్రం అనాధలు లేరా?? ఎక్కడో ఉక్రెయిన్ కు వెళ్లి తెచ్చుకోవాలా అంటూ నిష్టూరమాడుతున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X