జీసస్ క్రైస్ట్ నే 'గే' అని అభివర్ణించిన గే సెలబ్రిటీ..!!
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పాప్ సింగర్ ఎల్టన్ జాన్ గే అన్న సంగతి తెలిసిందే. ఆయన గారు డేవిడ్ ఫుర్నిష్ అనే దర్శకున్ని వివాహం కూడా చేసుకున్నారు. అంత వరకూ బాగానే వుంది, తన జీవితం తనిష్టం కాబట్టి ఎలా అయినా వుండవచ్చు. కానీ ఆయన ఏకంగా జీసస్ క్రైస్ట్ ను గే అని చెప్పి వివాదానికి కారణమయ్యాడు. ఇటీవల ఆయనో ఇంటర్యూలో మాట్లాడుతూ మనందరికీ దేవుడయిన జీసస్ ఓ గే. అతను అందరినీ ప్రేమించడం, క్షమించడం నేర్చుకొమ్మని చెప్పాడు.
జీసస్ మనుషుల బాధలను అర్థం చేసుకున్న ఓ ఇంటలిజెంట్ గే అని ఆయనా ఇంటర్యూలో చెప్పాడు. ఈ ప్రకటనపై ఆయన మీద సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు దేవుడి మీద కామెంట్ చేసే అర్హత అతనికుందా అంటూ మండి పడుతున్నారు.
ఎల్టన్ జాన్ హాలీవుడ్ డేవిడ్ ఫుర్నిష్ జీసస్ క్రైస్ట్ జోసెఫ్ గల్లిఅనో క్యాండల్ ఇన్ ద విండ్ elton john candle in the wind david furnish joseph galliano jesus hollywood


Click it and Unblock the Notifications