For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    23 ఏళ్ల వరకూ సెక్స్ లేదని బాధపడుతున్నాడు

    By Kuladeep
    |

    ప్రముఖ బ్రిటీష్ పాప్ సింగర్, పాటల రచయిత, కంపోజర్ సర్ ఎల్టన్ హర్కులెస్ జాన్ ను 23 ఏళ్లు వచ్చే వరకూ సెక్స్ లో పాల్గొనలేకపోవడం గురించి విచారాన్ని వ్యక్తం చేసారు. ఈ పాప్ స్టార్ తన జీవితంలో చేసిన తప్పిదాల గురించి, తన అనుభవాలను అన్నీ కలిపి రాసిన ఓ లెటర్ ను జోసెఫ్ గల్లిఅనో రాసిన పుస్తకం "డియర్ మీ: ఎ లెటర్ టు మై సిక్ట్సీన్ ఇయర్ ఓల్డ్ సెల్ఫ్" లో ప్రచురించారు. ఈ ఉత్తరంలో "క్యాండల్ ఇన్ ద విండ్" ఆల్బమ్ తో సంచలనం సృష్టించిన ఈ సింగర్ పై విధంగా స్పందించారు.

    ఎల్టన్ 2005లో డేవిడ్ ఫుర్నిష్ ను వివాహమాడిన సంగతి తెలిసిందే. అంతకు ముందు రినాట్ బ్లాయూల్ అనే ఓ రికార్డింగ్ ఇంజనీర్ ను వివాహమాడి విడాకులు తీసుకున్నాడు. తొలుత తాను బై-సెక్యువల్ అని ప్రకటించి ఆ తర్వాత 'గే' గా మారిన ఈ పాప్ మాంత్రికుడు డ్రగ్స్ తీసుకోవడం పై కూడా విచారం వ్యక్తం చేసాడు. తన జీవితంలో డ్రగ్స్ తీసుకున్న రోజులు చాలా దుర్భరమైనవని, ఆ తప్పు ఎవరూ చేయద్దని హితవు పలికారు. తాను ఓ యువకుడి ప్రేమలో పడి తప్పుచేసానని, ఆ తప్పుకు తగిన మూల్యం చెల్లించానని వేదాంత ధోరణిలో సెలవిచ్చారు. ప్రేమలో పడటానికి మించిన తప్పు ఇంకోటి లేదని, ఆ తప్పు చేయకండని మీకు నచ్చిన రీతిలో సురక్షితమైన సెక్స్ లో పాల్గొని సంతోషంగా వుండమని సెలవిచ్చారు. వినటానికి కొంచం ఇబ్బందిగా అనిపించినా ఆయన అనుభవాలను పంచుకోవడంలో తప్పులేదనిపిస్తోంది. ఏమంటారు!!

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X