టాప్ 'గే' ఐకాన్ గా ఆ పాప్ స్టార్...!!
బ్రిటీష్ మ్యూజిక్ మాంత్రికుడు సర్ ఎల్టన్ జాన్ పాటలు ఎన్నో రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ దాదాపు 200 మిలియన్ రికార్డులను అమ్మిన చరిత్ర గల ఎల్టన్ తాజాగా ప్రపంచంలోనే టాప్ 'గే' ఐకాన్ గా ఎంపికయ్యారు. తొలుత తాను బై-సెక్యువల్ అని ప్రకటించి ఆ తర్వాత 'గే' గా మారిన ఈ పాప్ మాంత్రికుడు 2005లో డేవిడ్ ఫుర్నిష్ ను వివాహమాడిన సంగతి తెలిసిందే.
ఇటీవల ఒన్ పోల్ డాట్ కామ్ నిర్వహించిన పోల్ సర్వేలో ఎల్టన్ ఎక్కువ మంది హోమోసెక్సువల్స్ గౌరవించే మగాడిగా, జూడీ గార్లాండ్ ఎక్కువ మంది హోమోసెక్సువల్స్ గౌరవించే ఉమన్ గా ఎంపికయ్యారు. ఇంకా ఈ జాబితాలో క్వీన్ సింగర్ దివంగత ఫ్రెడ్డీ మెర్క్యూరీ, బ్రిటీష్ టివి స్టార్ స్టిఫెన్ ఫ్రై లతో పాటు స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్హాం కూడా చోటు సంపాదించుకున్నాడు. వీరిలో డేవిడ్ బెక్హాం ఒక్కడే గే కాకపోవడం గమనార్హం.
ఎల్టన్ జాన్ గే పాప్ రారాజు పాప్ సింగర్ బ్రిటీష్ డేవిడ్ బెక్హాం డేవిడ్ ఫుర్నిష్ elton john david furnish gay pop singer david beckham


Click it and Unblock the Notifications