ఆమె ఫేమస్ అవుతుంది.. అందుకే వదిలేశా..
హాలీవుడ్ స్టార్ హీరోయిన ఎమ్మా వాట్సన్, ఆమె బాయ్ ప్రెండ్ ఫ్రాన్సిస్ బౌలీ ఇద్దరూ గత కొంత కాలంగా సాన్నిహిత్యంగా డేటింగ్ చేస్తున్నారు. ఐతే ఇటీవల సడన్‌గా ఫ్రాన్సిస్ బౌలీ మాత్రం ఎమ్మా వాట్సన్‌ని తన ప్రియురాలిగా ఉండడానికి ఇష్టపడడం లేదని వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం ఎమ్మా వాట్సన్‌కి సడన్‌గా ఫేమస్ అవడం, పేరు ప్రతిష్టలు రావడంతో తను ఆమె ముందు చిన్న చూపుకి గురి అవడమేనని హాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.
హారీ పొట్టర్ హీరోయిన్ గత కొంత కాలంగా ఫ్రాన్సిస్ బౌల్‌తో డేటింగ్ చేస్తుంది. ఇటీవల కొత్తగా బ్రిటీష్ టివి రియాలిటీ షో 'మేడ్ ఇన్ చెల్సా' లో ఎమ్మా వాట్సన్ పాల్గోని హాల్ చల్ చేస్తుంది. ఫ్రాన్సిస్ బౌలీ ఈ సందర్బంలో మాట్లాడుతూ ప్రస్తుతం ఎమ్మా వాట్సన్‌కి నాతో రోమాన్స్ చేయడం ఇష్టం లేదు. ఇది మాత్రమే కాదు నన్ను వదిలేసి ఇప్పుడు కొత్త బాయ్ ప్రెండ్ కోసం ప్రయత్నిస్తుందని హీట్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించాడు.
అంతేకాకుండా గతంలో మా మద్య ఎన్నో జరిగి ఉండవచ్చు, కానీ ఇప్పుడు నేను జెంటిల్ మెన్‌లా ఉండాలని అనుకుంటున్నానని అన్నారు. పత్రికా ముఖంగా మీకందరికి తెలియజేసేది ఏమిటంటే ఇక జీవితంలో ఓ చైల్డ్ హీరోయిన్ బాయ్ ప్రెండ్‌గా ఉండదలచుకొలేదని వెల్లడించాడు.


Click it and Unblock the Notifications











