ప్రియుడిపై దాడి చేసిన హీరోయిన్, అరెస్ట్
లాస్ ఏంజిల్స్ : హాలీవుడ్ నటి ఎమ్మా రాబర్ట్స్ అరెస్టయింది. ఆమె తన బాయ్ ఫ్రెండ్ ఇవాన్ పీటర్స్‌పై దాడి చేయడమే ఇందుకు కారణం. 22 ఏళ్ల ఎమ్మా రాబర్ట్స్, 26 ఏళ్ల ఇవాన్ పీటర్స్ గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ గొడవ పడ్డారు. దీంతో జులై 7న ఆమెను కెనడా పోలీసులు అరెస్టు చేసారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హోటల్ రూమ్‍లో వీరిద్దరు గొడవ పడుతున్నట్లు ఎవరో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకునే సరికి ఇవార్ పీటర్స్ ముక్కుకు గాయమై రక్తం కారుతూ కనిపించాడు. అయితే అరెస్టయిన కొద్ది గంటల్లోపే ఎమ్మా రాబర్ట్స్‌ను విడుదల చేసారు. పీటర్స్ ఆమెపై ఎలాంటి ఫిర్యాదు చేయక పోవడమే కారణమని తెలుస్తోంది.
పోలీసుల ముందు ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకున్నట్లు వెల్లడించారు. తాము వెళ్లే సరికి పీటర్స్ గాయపడి ఉండటం చూసి పోలీసులు ఎమ్మా రాబర్ట్స్‌ను అరెస్టు చేసినట్లు స్పష్టం అవుతోంది. ఇద్దరూ ఏదో కోపంలో దెబ్బలాడుకున్నారని, ఇది అంత సీరియస్ ఫైట్ కాదని వీరి సన్నిహితులు అంటున్నారు.
కెనడాలో జరిగిన ఈ సంఘటన తర్వాత ఇద్దరూ తిరిగి అమెరికా వచ్చారు. ప్రస్తుతం ఇద్దరు కలిసి పీటర్స్ హిట్ షో అమెరికన్ హారర్ స్టోరీ కోసం పని చేస్తున్నారు. ప్రేమికుల మధ్య ఇలాంటి గిల్లిగజ్జాలు సహజమేఅని, దీన్ని మీడియా బూతద్దంలో పెట్టి చూస్తూ అనవసర రాద్దాంతం చేస్తోందిన అంటున్నారు.


Click it and Unblock the Notifications












