twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డ్రగ్స్ డీలర్ పాత్రలో నటనను చింపేసింది..!

    By Nageswara Rao
    |

    టివి సిరిస్‌ డ్రైవ్ ద్వారా తన సినీ కెరియర్‌ని ప్రారంభించి 2007వ సంవత్సరంలో సూపర్ బ్యాడ్ అనే కమెడియన్ సినిమా ద్వారా ఎమ్మా స్టోన్ హాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ది హౌస్ బున్నీ, జొంబీ ల్యాండ్, పేపర్ మ్యాన్ అనే సినిమాల ద్వారా తనలోని నటనా విశ్వరూపాన్ని ప్రదర్శించింది. 2011వ సంవత్సరానికి గాను 'ఈజీ ఎ' స్కూల్ కామెడీ సినిమాకు గాను గోల్డెన్ గ్లోబ్ బెస్ట్ హీరోయిన్ అవార్డుని సొంతం చేసుకుంది.

    ఎమ్మా స్టోన్ రాబోయే కాలంలో విడుదలకు సిద్దంగా ఉన్న 'లిటిల్ వైట్ కోవర్టీ' సినిమాలో డ్రగ్ డీలర్‌గా అద్బుతమైన ఫెర్పామెన్స్‌ని అభిమానులకు అందిచనుందని హాలీవుడ్ సమాచారం. 23 సంవత్సరాలు వయసు కలిగిన ఎమ్మా స్టోన్ నటన తన సినీ కెరియర్‌లో హైలెట్ గా నిలుస్తందని అంటున్నారు. ఇక సినిమా కధ విషయానికి వస్తే తన తండ్రి చనిపోతూ తన కారులో వదిలేసిన డ్రగ్స్‌ని అతని కూతురు, కొడుకు మియామి నగరానికి వెళుతూ వాటిని ఎలా అమ్ముతారనే కధలో సారాంశం.

    ఆ కూతురు పాత్రలో ఎమ్మా స్టోన్ నటించింది. ఇక ఈ చిత్రానికి కధని మైఖెల్ అందించగా, ఈ సినిమాకు దర్శకత్వం కూడా తానే వహించాలని అనుకున్నప్పటికీ, నిర్మాత స్కాట్ అవర్సినో మాత్రం కొత్త డైరెక్టర్‌ని ఎంచుకున్నాడని సమాచారం. ఇక ఈ సినిమా నిర్మాతలు బ్రాడ్ పిట్‌తో వరల్డ్ వార్ జడ్, జానీడెప్‌తో డార్క్ షాడోస్ అనే అత్యంత బ్రాహ్మాండమైన నిర్మాణాత్మక విలువలతో కూడిన సినిమాలను నిర్మించారు.

    English summary
    Actress Emma Stone will play a novice drug dealer in upcoming movie “Little White Corvette”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X