హీరోయిన్ కోట్ల రూపాయల విరాళం: సెక్సువల్, రేప్ బాధితుల కోసం....
హాలీవుడ్ హీరోయిన్ ఎమ్మా వాట్సన్ సెక్సువల్ హరాస్మెంట్, రేప్ బాధితులకు అండగా నిలిచేందుకు భారీ విరాళం అందించారు. ఎంతో కీలకమైన ఈ కాంపెయిన్ కోసం ఆమె ఏకంగా 1 మిలియన్ బ్రిటిష్ పౌండ్స్(రూ. 9 కోట్ల పైనే) డొనేట్ చేశారు.

సెక్సువల్ హరాస్మెంటుకు ముగింపు కోసం
27 సంవత్సరాల ఈ యంగ్ యాక్టర్ ‘యూకె జస్టిస్ అండ్ ఈక్వాలిటీ ఫండ్' కోసం ఈ భారీ మొత్తాన్ని అందించారు. పని ప్రదేశంలో సెక్సువల్ హరాస్మెంటుకు ముగింపు పలకాలని దాదాపు 200 మంది ఫిమేల్ బ్రిటిష్ యాక్టర్లు సంతకం చేసి విడుదల చేసిన ఓపెన్ లెటర్ అనంతరం... ఆమె వెంటనే స్పందిస్తూ ఈ భారీ విరాళం అందించారు.

ఎమ్మా వాట్సన్ కూడా బాధితురాలే
సెక్సువల్ హరాస్మెంట్ ఎదుర్కున్న వారిలో ఎమ్మావాట్సన్ కూడా ఒకరు. ఆ పెయిన్ ఎలా ఉంటుందో స్వయంగా అనుభవించిన వ్యక్తికాబట్టే ఆమె ఈ విషయంలో చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు.

సంపాదన భారీగా...
హాలీవుడ్లో పలు భారీ చిత్రాల్లో ఎమ్మా వాట్సన్ నటించారు. 2001 నుండి 2011 వరకు వచ్చిన ఎనిమిది ‘హారీ పొట్టర్' సిరీస్ చిత్రాల్లో నటించిన ఆమె ఆమె దాదాపు 39 మిలియన్ పౌండ్స్ ఆర్జించినట్లు సమాచారం. గతేడాది టైమ్స్ రిచ్ లిస్టులో ఎమ్మా కూడా ఉన్నారు.

హార్వీ వెయిన్‌స్టన్
ఎంతో మంది హాలీవుడ్ హీరోయిన్లపై సెక్సువల్ హరాస్మెంటుకు పాల్పడ్డ హార్వీ వెయిన్‌స్టన్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన వారిలో ఎమ్మా వాట్సన్ కూడా ఒకరు. 2011లో అతడి బేనర్లో ‘మై వీక్ విత్ మార్లిన్' అనే చిత్రంలో ఎమ్మా వాట్సన్ నటించారు.


Click it and Unblock the Notifications











