నేను కూడా ఒకసారి మందు త్రాగానంటున్న హీరోయిన్
హాలీవుడ్లో హ్యారీ పోటర్ సిరిస్ ద్వారా టాప్ స్దానాన్ని కైవసం చేసుకున్న సూపర్ హీరోయిన్ ఎమ్మా వాట్సన్. ప్రస్తతుం హ్యారీ పోటర్ సిరిస్‌లో చివరి సినిమా అయిన 'హ్యారీ పోటర్ డెత్లీ హాల్లోస్ పార్ట్ 2' సినిమా ప్రమోషన్‌లో భాగంగా 'లేట్ షో విత్ డేవిడ్ లెటర్ మ్యాన్' షోకి వచ్చిన ఎమ్మా వాట్సన్ తన అనుభవాలను పంచుకున్నారు. ఈ షోలో లెటర్ మ్యాన్ ఎమ్మా వాట్సన్‌ని డేనియల్ రాడ్ క్లిఫ్‌పై నీ అభిప్రాయం ఏమిటని అడడగా.. మొదట్లో డేనియల్ రాడ్ క్లిఫ్ గురించి నాకు అంతగా తెలిసేది కాదు.
కానీ ఈ హ్యారీ పోటర్ సిరిస్ ద్వారా తనని అర్దం చేసుకునే అవకాశం కలిగింది. మేము హ్యారీ పోటర్ షూటింగ్ సమయంలో ఎప్పుడైనా మేము ఆరోగ్యం బాగాలేదు అంటూ సిక్ సెలవులు పెడతాం. కానీ డేనియల్ రాడ్ క్లిఫ్ అలా కాదు. షూటింగ్ సమయాలలో చాలా ప్రోపెషనల్‌గా ఉంటాడు. ఇది మాత్రమే కాకుండా ఈ హ్యారీ పోటర్ సిరిస్ ద్వారా నాకు ఒక మంచి స్నేహితుడు లభించాడని తెలిపింది. ఇక డేనియల్ రాడ్ క్లిఫ్ ఎప్పుడైనా ఆల్కహాల్ తీసుకుంటాడా అని ప్రశ్నించగా సరదాగా ఎప్పుడైనా పార్టీలకు వెళ్లినప్పుడు అతను ఆల్కహాల్ తీసుకుంటాడని తెలియజేసింది.
చివరగా ఎమ్మా వాట్సన్‌ని నీవు ఎప్పుడైనా తాగావా అని ప్రశ్నించగా, దీనికిగాను అవును నేను ఒకే ఒకసారి మాత్రం స్పిరిట్స్‌ను ట్రై చేశాను. లండన్‌లో నాకు 18 సంవత్సరాల వయుసు ఉన్నప్పుడు తాగడం జరిగిందని తన మధుర జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఐతే ఇప్పుడు మాత్రం నాకు అమెరికాలో లీగల్‌గా తాగడానికి అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుతం నావయసు 21వ సంవత్సరాలు. ఎవరైనా ఎప్పుడైనా వారియొక్క జీవితంలో ఆల్కహాల్‌ని తాగోచ్చు. నేను మాత్రం ఒకేఒకసారి ఆల్కహాల్ తీసుకోవడం జరిగిందని వెల్లిడంచారు. ఇక డేనియల్ రాడ్ క్లిఫ్, ఎమ్మా వాట్సన్ హీరో, హీరోయిన్లుగా నటించిన హ్యారీ పోటర్ డెత్లీ హాల్లోస్ పార్ట్ 2 ప్రీమియర్ జులై 11న న్యూయార్క్‌లో వేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రీమియర్‌కి హ్యారీ పోటర్ టీమ్ మొత్తం హాజరవ్వడం జరిగింది.


Click it and Unblock the Notifications











