కొత్త బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతున్న హ్యారీ పోటర్ తార
హ్యారీ పోటర్ తార ఇమ్మా వాట్సన్ తాజాగా ఇంతకు ముందు ఫైనాన్సియర్ జే బ్యారీమోర్ తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తులు వచ్చాయి. తాజాగా ఇప్పుడీ తార స్పెయిన్ కు చెందిన రాక్ స్టార్ రఫెల్ సిబ్రెయిన్ కలసి చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత వారాంతంలో రేంజర్స్ గేమ్స్ వద్ద వీరిద్దరూ కలసి సందడి చేసారట. వీరిద్దరూ ఒకరికి ఒకరు చాలా దగ్గరగా కూర్చుని, చాలా సన్నిహితంగా మెలుగుతున్నారని.. దీన్ని చూస్తే వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని అనిపిస్తోందని న్యూయార్క్ పోస్ట్ ఓ వార్తను ప్రచురించింది. దీంతో హాలీవుడ్ లో వీరిద్దరి మధ్య గల సంబంధం గురించే అందరూ చెవులు కొరుకుంటున్నారట. ఇంతా జరుగుతున్నా దీనిపై వాట్సన్ మాత్రం మౌనం వహిస్తోంది...
ఇమ్మా వాట్సన్ హాలీవుడ్ జే బ్యారీమోర్ రఫెల్ సిబ్రెయిన్ హ్యారీ పోటర్ emma watson harry potter hollywood rafael cebrian new york post


Click it and Unblock the Notifications