లాక్‌డౌన్ నిబంధనల మధ్య ఎమ్మీ అవార్డులు.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా జెన్నిఫర్

కరోనావైరస్ భయాల మధ్య లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ 72వ ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డుల కార్యక్రమం నిరాడంబరంగా సాగింది. జిమ్మి కిమ్మెల్, జెన్నిఫర్ అనిస్టన్ హోస్ట్‌గా వ్యవహరిస్తూ ఈ అవార్డుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించారు. ఈ అవార్డుల కార్యక్రమంలో చాలా జాగ్రత్తలు తీసుకొన్నారు. శానిటైజేషన్, ఇద్దరు వ్యక్తు మధ్య 60 అడుగుల దూరం పాటించారు. వేడుక ప్రారంభానికి ముందు గతంలో హాజరైన సెలబ్రిటీల వీడియోను చూపించారు. ఆ తర్వాత ప్రేక్షకులు, సెలబ్రిటీలు లేని ఆడిటోరియంను చూపించారు.

ప్లకార్డుల ఆధారంగా నామినేషన్లను చదువడానికి ముందు అతి జాగ్రత్తగా వాటిని శానిటైజ్ చేస్తూ కనిపించారు. అభ్యర్థుల పేర్లను ప్రకటించిన తర్వాత నామినేషన్ ప్లకార్డులను జాగ్రత్తగా డస్ట్ బిన్‌లో వేసి వెంటనే కాల్చివేశారు. వేదిక మీద నుంచి కాకుండా అవార్డులు, ట్రోఫీలను నేరుగా ఇంటి వద్దనే స్వీకరించాలని చెప్పగానే హోస్ట్ వేదిక నుంచి ఇంటికి బయలుదేరి వెళ్లారు. ఆమకు కూడా ఈ అవార్డులకు నామినేట్ అయ్యారు.

Emmys 2020: Succession and Watchmen gets more awards

ఎమ్మీ అవార్డుల కార్యక్రమంలో వాచ్‌మెన్, సక్సెషన్ చిత్రాలకు భారీగా అవార్డుల దక్కాయి. ఈ రెండు చిత్రాలకు నాలుగేసి అవార్డుల రావడం విశేషం. ఉత్తమ సహాయ నటిగా ఓజ్రాక్ చిత్రానికి గాను జూలియా గార్నర్‌కు లభించింది. ది మార్నింగ్ షో సినిమాకు గాను బిల్లీ కడప్ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డును అందుకొన్నారు. యుఫోరియా చిత్రంలో అద్భుత నటనకు గాను ఉత్తమ నటిగా జెండియా ఎంపియ్యారు. సక్సెషన్ చిత్రానికి గాను జెరిమీ స్ట్రాంగ్ ఉత్తమ నటుడి అవార్డును అందుకొన్నారు.

ఎమ్మీ అవార్డుల సందర్భంగా జెన్నిఫర్ అనిస్టన్ తన చిరకాల మిత్రులను కలుసుకొన్నారు. తన స్నేహితులు కౌర్ట్నీ కాక్స్, లిసా కుండ్రోను కలుసుకొని సంతోషంలో మునిగిపోయారు. ముగ్గురు కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. మేమంతా కలిసి ఉన్నాం. 1994 నుంచి రూమ్ మేట్స్ అంటూ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X