అభిమానులను ట్విట్ చెయ్యడంలో అగ్రస్దానంలో నిలచిన హీరోయిన్...
ఇటీవల అమెరికాలో హైతి భూకంప బాధితులకోసం చాలా మంది చాలా రకాలుగా విరాళాలు సేకరించారు. ఈ భూకంప బాధితులకోసం మాజీ అమెరికా ప్రెసిడెంట్స్ బిల్ క్లింటన్ మరియు జార్జి బుస్ లు కూడా వారి వంతు సహాయాన్ని అందించారు. ఇలాంటి సమయంలో హాలీవుడ్ లో వినూత్నంగా ట్విట్టర్ ద్వారా ట్విట్ చేంజ్ అనే ఆన్ లైన్ ఆక్షన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ పదిరోజుల ఆక్షన్ లో దాదాపుగా వంద మంది ప్రముఖ హీరోలు మరియు మ్యూజిషియన్స్ తోపాటు స్పోర్ట్స్ స్టార్స్ లాంటి చాలా మంది ప్రముఖులు పోల్గోని వాళ్శయొక్క ట్వీట్స్ ని ప్రజలకు తెలియజేశారు. ఈ ఆన్ లైన్ ఆక్షన్ కార్యక్రమం నిర్వహించినటువంటి కామ్ పోల్ట్ సర్విస్ వారు 5,40,000 డాలర్లుని వసూలు చేయడం జరిగిందన్నారు. వచ్చనటువంటి ఈ మొత్తాన్ని హైతి ప్రజలకు అందించనున్నామని ఇందులో మొత్తం దాదాపుగా 13,000బిడ్స్ రావడం జరిగిందన్నారు.
ఈ ఆన్ లైన్ ఆక్షన్ లో డిస్పరేట్ హౌస్ వైప్స్ స్టార్ ఇవా లంగోరియా ట్వీట్ చేసినటువంటి మెసెజ్ లకు మొట్టమొదటి స్దానం లభించింది. ప్రెసిడెంట్ ఆఫ్ అల్టిమేట్ పైటింగ్ చాంఫియన్ షిప్ సెలబ్రిటీ దానా వైట్ 29,000 డాలర్లుతో రెండవ స్దానంలో నిలిచింది. హాలీవుడ్ లో అత్యధికంగా 90,000ఫాలోర్స్ ఉన్న ప్రముఖ టివి ఛానెల్ యాక్టర్ జచారి లెవి 20000 డాలర్లుతో మూడవ స్దానంలో నిలిచింది. ఇక ట్విట్టర్ సూపర్ స్టార్ జస్టిన్ బైబర్ మాత్రం 13000 డాలర్లుతో తోమ్మిదవ స్దానంతో సరిపెట్టుకున్నారు. దీనిని బట్టి ట్విట్టర్ ఎకౌంట్ మనకు ఈవిధంగా కూడా ఉపయోగపడుతుందన్నమాట. ఇది గమనించిన మన టాలీవుడ్ హీరోలు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే ఈ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తారేమో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











