మాంసం లేని ఆహారమే చర్మ సౌందర్య రహస్యం
హాలీవుడ్లో గ్లామర్స్ స్టయిల్‌కి ఇవా మెండిస్ పెట్టింది పేరు. అలాంటి ఇవా మెండిస్‌ని మీరు ఇంత అందంగా.. స్లిమ్‌గా ఉండడానికి కారణం ఏంటని ప్రశ్నించగా.. మాంసం-లేని ఆహారమే తన చర్మ సౌందర్య రహాస్యమని అంటుంది. చర్మం ప్రకాశవంతంగా కనిపించడానికి కేవలం చేప మాత్రమే తింటానని అన్నారు. దీనితో పాటు రోజుకీ మూడు లీటర్ల మంచి నీరు త్రాగుతానన్నారు.
నేను ఎక్కువగా చేపను తింటాను. గత కొన్ని సంవత్సరాలుగా మాంసం లేని ఆహారం తీసుకోవడం వల్ల నా చర్మం సౌందర్యవంతంగా ఉందని
అన్నారు. నేను అందం అనేది వీటి నుండి వస్తుందని నమ్మాను కాబట్టే రోజుకీ మూడు లీటర్ల మంచి నీరు త్రాగడంతో పాటు బాగా తిని వ్యాయామం చేస్తానన్నారు.
38 ఏళ్ల వయసు కలిగిన ఇవా మెండిస్ షవర్ క్రింద స్నానం చేసే సమయం కూడా తక్కువేనన్నారు. షవర్ క్రింద ఐదు నిమిషాలు స్నానం చేస్తే చాలు. ఇక రేయన్ గోస్లింగ్ హీరో ప్రదాన పాత్రలో త్వరలో విడుదలవుతున్న సినిమా 'ద ప్లేస్ బియాండ్ ద పైన్స్', ఈ సినిమాలో ఇవా మెండిస్ అతని భార్యగా నటిస్తున్నారు. ఇద్దరు స్టార్స్‌లకు సంబంధించిన కొన్ని సీన్లను న్యూయార్క్‌లో తీయడం జరుగుతుంది. ఈ సినిమాలో ఇవా మెండిస్ మాస్ హీరోయిన్‌గా అభిమానుల మనసు దోచుకుంటారని సినిమాని తీస్తున్న డైరెక్టర్ డెరిక్ కెయిన్ ఫ్రాన్స్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











