డెనిమ్ షార్ట్‌తో కుర్రకారు మతి పోగొడుతున్న ఆంటీ..
హాలీవుడ్లో గ్లామర్స్ స్టయిల్‌కి ఇవా మెండిస్ పెట్టింది పేరు. అలాంటి ఇవా మెండిస్ తను నటిస్తున్న కొత్త చిత్రంలో చింపిరి చింపిరి చిరిగిన బట్టలతో చాలా సెక్సీగా కనిపిస్తూ అభిమానులలో ఆశలు రేకెత్తిస్తున్నారు. రేయన్ గోస్లింగ్ హీరో ప్రదాన పాత్రలో నటించగా, ఇవా మెండిస్ అతని భార్యగా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇద్దరు స్టార్స్‌లకు సంబంధించిన కొన్ని సీన్లను న్యూయార్క్‌లో తీయడం జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ సందర్బంలో ఇవా మెండిస్ కనిపించిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది.
అందుకు కారణం ఇవా మెండిస్ ఈ సినిమాలో డెనిమ్ షార్ట్‌ని తన తొడలు పూర్తిగా కనిపించే విధంగా ధరించడమే కాకుండా తనే చేతికి ఫ్యాషన్ బ్రాస్ లెట్స్‌ని ధరించడంతో ఈ సినిమాలో ఇవా మెండిస్ నటిస్తున్న క్యారెక్టర్ ఇట్టే అభిమానులకు అర్దమైపోయింది. ఈ సినిమాలో ఇవా మెండిస్ మాస్ హీరోయిన్‌గా అభిమానుల మనసు దోచుకుంటారని సినిమాని తీస్తున్న డైరెక్టర్ డెరిక్ కెయిన్ ఫ్రాన్స్ వెల్లడించారు.
ఇక సినిమా హీరో రేయన్ గోస్లంగ్ విషయానికి వస్తే తనో మోటార్ సైక్లిలిస్ట్‌గా తన భార్య, పిల్లలను రక్షించుకనే క్రమంలో సాగుతుందని తెలిపారు. రేయన్ గోస్లంగ్ ఈ సినిమాలో
స్లీవ్ లెస్ టీషర్ట్‌లు, ఒంటి నిండా టాటూలు వేసుకొని, బ్లీట్-బ్లండీ జుట్టుతో కుర్రకారు హృదయాలను ఇట్టే ఆకట్టుకుంటారనే వెల్లడించారు. ఈ సినిమాలో ఎక్కువ భాగం యాక్షన్ సీన్లతో రూపోందించడం జరుగుతుందని తెలిపారు. ఇక మీరు ప్రక్కనున్న ఇమేజిని గనుక చూసినట్లైతే ఈ సినిమా ఏవిధంగా ఉంటుందో అంచనా వేసుకొవచ్చు. ఐతే ఈ సినిమాని అభిమానులు చూడాలంటే మాత్రం 2013 వరకు ఆగాల్సిందేనని అంటున్నారు.


Click it and Unblock the Notifications











