గతి లేక రెస్టారెంట్లో వెయిట్రస్‌గా చేరిన హీరోయిన్
సినిమాలలో అతి సాధారణమైన రోల్స్ వేస్తూ అనతి కాలంలోనే నెంబర్ వన్ స్దానాన్ని భర్తీ చేసిన స్టార్ హీరోయిన్ ఇవా మెండిస్. గోస్ట్ రైడర్ సినిమా ద్వారా యావత్ ప్రపంచం మొత్తానికి తన సత్తా చాటింది. అంతేకాకుండా అమెరికాలో ఇవా మెండిస్ ఫ్యాషన్‌కి పెట్టింది పేరు. ప్రస్తుతం ఇవా మెండిస్ డైరెక్టర్ డెరిక్ సిన్ఫ్రాన్స్ దర్శకత్వంలో 'ద ప్లేస్ బియాండ్ ద పైన్స్' అనే సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమాలో ఇవా మెండిస్ క్యారెక్టర్ హోటల్ వెయిటర్. హోటల్ వెయిటర్ క్యారెక్టర్‌ని ఛాలెంజింగ్‌గా చేసేందుకు గాను ఇవా మెండిస్ న్యూయార్క్ లోని ఓ ప్రముఖ హోటల్‌లో నిజంగానే వెయిట్రస్గా చేరడం జరిగింది. దీనిని బట్టి చూస్తుంటే ఇవా మెండిస్‌కి వృత్తి మీద ఉన్న నిబద్దత ఎంతో తెలిసిపోతుంది. 37 సంవత్సరాల వయసు కలిగిన ఇవా మెండిస్ నిజంగా ఈ సాహాసం చేయడంతో అభిమానులు ఆమెకు నిరాజనం పడుతున్నారు.
ఇంతకీ ఇవా మెండిస్ వెయిట్రస్గా చేరిన హోటల్ పేరేంటని అనుకుంటున్నారా.. న్యూయార్క్ లోని ఆల్బేలో ఉన్న 'రూట్ 7 డిన్నర్' అనే హోటల్‌లో ఇనా మెండిస్ షిప్ట్ వైజ్ వెయిట్రస్గా చేరడం జరిగింది. ఈ సందర్బంలో రెస్టారెంట్ మేనేజర్ కోలెన్ నోబెల్ మాట్లాడుతూ ఇవా మెండిస్ వెయిట్రస్గా చేసిన పని తీరు మమ్మల్ని ఆశ్చర్యపరిచిందని అన్నారు. అక్కడున్న కస్టమర్స్‌లో కొంత మంది ఇవా మెండిస్‌ని గుర్తు పట్టడం జరిగింది. చివరగా మేనేజర్ నోబెల్ మాట్లాడుతూ ఇవా మెండిస్ మా హోటల్‌లో వెయిట్రస్గా పని చేయడం మా అదృష్టం అని అన్నారు.


Click it and Unblock the Notifications











