»   » హీరో మీద మనసు పారేసుకున్న ఛోటా స్టార్ హీరోయిన్ తల్లి

హీరో మీద మనసు పారేసుకున్న ఛోటా స్టార్ హీరోయిన్ తల్లి

Posted By:
Subscribe to Filmibeat Telugu

డిస్నీ సినిమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న బుల్లి స్టార్ హీరోయిన్ 17 ఏళ్ల మిలే సరస్ తన సహనటుడు లియామ్ హెమ్స్వర్త్ తో పీకల్లోతు ప్రేమలో పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయమై మీడియాతో మాట్లాడిన ఆమె ఓ జుగుప్సాకరమయిన నిజాన్ని బయటపెట్టింది. తనే కాదు తన ప్రియుడి మీద తన తల్లి కూడా మనసు పారేసుకుందని తెలిపింది. లియామ్ హెమ్స్వర్త్ చాలా అందంగా వుంటాడు. అతని మీద ఎంతో మంది మనసుపడి వుంటారు. కానీ నేనే నా కంటే అందంగా వున్న వాడితో తిరగడం నచ్చక వూరకుండిపోయాను. కానీ మా అమ్మ లియామ్ తో డేటింగ్ చెయ్యమని నన్ను ప్రోత్సహించింది. దీనికి కారణం లియామ్ అంటే మా అమ్మ కూడా చాలా ఇష్టం. వీలు లేక వొదిలేసింది కానీ కుదిరి వుంటే ఆమే లియామ్ తో డేటింగ్ చెయ్యడానికి సిద్ధపడింది అని గుట్టు బయటపెట్టింది. నా కంటే తన తల్లే లియామ్ ను ఎక్కువగా ప్రేమిస్తోంది అని చెప్పి గట్టిగా నవ్వేసింది.

అయినా తన కూతురి ప్రియున్ని తల్లి ప్రేమించడం ఏంటీ మరీ దరిద్రంగా అనుకుంటున్నారా..?? పాశ్చాత్తులకు ఇవన్నీ మామూలే లెండి..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu