నటిని బాత్రూంలో కట్టేసి.. అయినా తప్పించుకుంది, బాడీ గార్డ్ విషయంలో సంచలన నిర్ణయం!
Recommended Video

హాలీవుడ్ శృంగార తార, టివి హోస్ట్ కిమ్ కర్ధాషియాన్ తరచుగా వార్తల్లో నిలుస్తుండడం చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం కిమ్ కర్దాషియన్ కు అలవాటే. ఆ మద్యన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ని ఉద్దేశించి కిమ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ట్రంప్ ఫోన్ ఫోన్ చేసిన సమయంలో తాను నగ్నంగా ఉన్నానంటూ కిమ్ ఓ ఇంటర్వ్యూలో సిగ్గుపడుతూ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. తాజగా కిమ్ పెద్ద సమస్య నుంచి తప్పించుకుంది.

2016లో జరిగిన ఘటన
2016లో ఓ ఫ్యాషన్ షోకు హాజరయ్యేందుకు కిమ్ ప్యారిస్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆమె బసచేసిన అపార్ట్మెంట్ లో కిమ్ కర్దాషియన్ ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ సంఘటన అప్పట్లో పెద్ద దుమారంగా నిలిచింది. దీనికి సంబంధించిన కేసు ఇప్పటికి కొనసాగుతూనే ఉంది.

బాత్ రూమ్‌లో కట్టేసి మరీ
కొందరు దుండగులు కిమ్ బసచేస్తున ఫ్లాట్ కు వెళ్లి ఆమెని బాత్ రూంలో బంధించారు. కిమ్ కర్ధాషియాన్ వద్ద ఉన్న ఆభరణాలన్ని దొంగిలించుకు వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో కిమ్ కర్ధాషియాన్ బాడీగార్డ్ దువియర్ బయటకు వెళ్లడంతో దొంగల పని సులువైంది.

భారీ నష్టం తప్పించుకుని
చోరీకి గురైన కిమ్ ఆభరణాలు విలువ తెలిస్తే షాక్ కి గురి కావలసిందే. ఆమె ఆభరణాల విలువ 6.1 మిలియన్ డాలర్లు. అంటే దాదాపుగా 45 కోట్లు విలువచేసే ఆభరణాలు అవి. ఆ ఆభరణాలకు ఇన్సూరెన్స్ ఉండడంతో కిమ్ కు ఎటువంటి నష్టం కలగలేదు. ఆ మొత్తాన్ని ఇన్సూరెన్స్ సంస్థ కిమ్ కు అందజేసింది.

బాడీ గార్డ్ వల్లే నష్టం
కానీ ఇన్సూరెన్స్ సంస్థ మాత్రం కిమ్ కు బాడీ గార్డ్ నియమించిన సంస్థపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బాడీ గార్డ్, అతడి సంస్థ వలనే తమకు ఈ స్థాయిలో నష్టం వాటిల్లిందని కోర్టులో పేర్కొంది. కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











