మాజీ భార్యకు ఎంగేజ్‌మెంట్ అభినందనలు: బ్రాడ్ పిట్
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ తన మాజీ భార్య జెన్నిఫర్ ఆనిస్టన్‌ని అభినందించాడు. జెన్నిఫర్ ఆనిస్టన్, బ్రాడ్ పిట్ ఇద్దరూ 2000 నుండి 2005 వరకు కలిసి జీవించి ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. ఐతే ఇన్నాళ్లకు బ్రాడ్ పిట్ తన మాజీ భార్యకు అభినందనలు ఎందుకు తెలిపాడని అనుకుంటున్నారా..
భర్త నుండి విడాకులు తీసుకున్న తర్వాత జెన్నిఫర్ ఆనిస్టన్ కొన్నాళ్లు ఒంటరిగా జీవించినా గత కొంత కాలంగా నటుడు మరియు డైరెక్టర్ జస్టిన్ థ్రాక్స్ తో డేటింగ్ చేస్తుంది. ఆగస్టు 10న జస్టిన్ థ్రాక్స్ 41వ పుట్టినరోజు సందర్బంగా 43 సంవత్సరాల వయసు కలిగిన జెన్నిఫర్ ఆనిస్టన్‌కి, జస్టిన్ థ్రాక్స్ ప్రపోజ్ చేయడం.. ఆ వెంటనే అక్కడే ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోయింది. ఈ శుభవార్త తెలిసిన బ్రాడ్ పిట్ తన మాజీ భార్య జెన్నిఫర్ ఆనిస్టన్ తిరిగి మళ్లీ పెళ్లి చేసుకుంటున్నందుకు గాను తన అభినందనలు తెలిపారు.
గత ఏప్రిల్‌లో పిట్, జోలీ జంటకు నిశ్చతార్దం అయిన విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి వివాహాం సెప్టెంబర్ లో జరగనుంది. దీంతో వీరి వివాహానికి జెన్నిఫర్ ఆనిస్టన్ ఆల్ ద బెస్ట్ చెప్పింది. బ్రాడ్ పిట్ తనకి కాబోయే భార్య ఏంజిలీనా జోలీ కోసం పెళ్లి కానుకగా $390,000 విలువ కలిగిన ఖరీదైన లగ్జరియస్ పాటెక్ ఫిలిప్పీ మినిట్ రిపీటర్ వాచ్‌ని గిప్ట్‌గా ఇవ్వనున్నాడు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











