twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విడాకులు: మాజీ భర్తకు సానుభూతిని తెలియజేసిన మాజీ భార్య

    By Nageswara Rao
    |

    లండన్: హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూయిజ్‌పై తన మాజీ భార్య మిమి రోజర్స్ సానుభూతిని తెలియజేసింది. ఇంతకీ మిమి రోజర్స్ తన మాజీ భర్తపై సానుభూతి తెలియజేయడానికి గల కారణం ఏమిటంటే తను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకోని ఆరు సంవత్సరాలు కలిసి జీవించిన తర్వాత తన భార్య క్యాటీ హాల్మస్ తన నుండి విడాకులు తీసుకోవడమే.

    56 సంవత్సరాల వయసు కలిగిన మిమి రోజర్స్, టామ్ క్రూయిజ్‌ని పెళ్లి చేసుకోని 1987 నుండి 1990 వరకు కలిసి జీవనం సాగించారు. ఇద్దరి మధ్య మనస్పర్దలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు. టామ్ క్రూయిజ్ మొదటి భార్య మిమి రోజర్స్ ఈ సందర్బంలో మాట్లాడుతూ తన మూడవ భార్య అయిన క్యాటీ హాల్మస్, టామ్ క్రూయిజ్ నుండి విడాకులు కావాలంటూ న్యూయార్క్ కోర్టుని ఆశ్రయించడం.. విడాకులు పొందడం లాంటివి తెలియడంతో తన మాజీ భర్తపై సానుభూతిని తెలియజేసింది.

    వారిద్దరికి మంచి జరగాలని కోరుంటున్నాను. ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు. ఆరు సంవత్సరాల పాటు కలిసి జీవించిన టామ్ క్రూయిజ్, క్యాటీ హాల్మస్ ఇద్దరూ ఇటీవల విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికి ఆరు సంవత్సరాల వయసు కలిగిన సూరి క్రూయిజ్ అనే కూతరు ఉంది. ప్రస్తుతం సూరి క్రూయిజ్ తన తల్లి క్యాటీ హాల్మస్ వద్దనే ఉంటుంది. వారాంతంలో తన తండ్రి సూరి క్రూయిజ్‌ని కలుసుకునే విధంగా కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది.

    2006వ సంవత్సరంలో క్యాట్ హాల్మస్‌ను టామ్ క్రూయిజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. క్యాట్ హాల్మస్‌కు ఇదే మొదటి వివాహం కాగా, టామ్ క్రూయజి్‌కు మూడవ వివాహం. టామా క్రూయిజ్ గతంలో హాలీవుడ్ స్టార్ హీరోయిన్లు మిమి రోజెర్స్, నికోల్ కిడ్‌మన్‌లను వివాహం చేసుకున్నాడు. నికోల్ కిడ్ మన్‌లతో కలిసి ఉన్నప్పుడు టామ్ క్రూయిజ్ ఇసాబెల్లా జానే, కానర్ ఆంటోనీ ఇద్దరు పిల్లలను దత్తతు తీసుకున్నాడు. దీంతో టామ్ క్రూయిజ్‌కు మొత్తం ముగ్గురు పిల్లలు.

    తెలుగు వన్ఇండియా

    English summary
    Tom Cruise’s former wife Mimi Rogers has expressed her sympathy for the actor over his heartbreak. The 56-year-old actress, who was married to Tom from 1987 to 1990, sympathised with Cruise and his third wife Katie Holmes over their recent split.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X