రీ-షూట్ జరుపుకుంటున్న భారీ యాక్షన్ సినిమా..!!

By Kuladeep

ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజలీనా జోలీ నటిస్తున్న భారీ యాక్షన్ సినిమా సాల్ట్. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు ముగించుకొని నిర్మాణాంతర కార్యక్రమాలు నడుస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను రీ-షూట్ చేస్తున్నారు. ఈ సినిమా రషెష్ చూసిన దర్శకుడు ఫిలిప్ నాయిస్, నిర్మాత లారెంజో కొన్ని సీన్లు సరిగా రాలేదని భావించారు. అంతే వెంటనే రీ-షూట్ కు వెళ్దామనే నిర్ణయానికి వచ్చారు. ఏంజలీనా కూడా వారిని ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా రీ-షూట్ కు అనుమతించిందట.

క్లయిమాక్స్ తో పాటు మరో సన్నివేశం అనుకున్న విధంగా రాలేదని సమాచారం. దీంతో ఎంజలీనా మరో సారి ఫైట్లు చేయాల్సివస్తోంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే CIA ఏజెంట్ గా పనిచేస్తోన్న ఏంజలీనా జోలీ ని రష్యాకు చెందిన గూఢచారిగా అనుమానించి అంతం చెయ్యాలని ప్రయత్నిస్తారు. ఆ తర్వాత ఆమె ఎలా వారి బారి నుండీ తనని తాను రక్షించుకొంటూ, తన నిజాయితీని నిరూపించుకుంది అనేది మిగిలిన కథ. కాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, ట్రెయిలర్ లకు మంచి స్పందన వచ్చింది. ఇందులో జోలీ సాల్ట్ మరియు ఏంజీ అనే రెండు గెటప్ లలో కనిపిస్తుంది. ట్రెయిలర్లు చూసిన వారికి ఇందులో జోలీ చేసే సాహసకృత్యాలు ఎలా వుండబోతున్నాయో తెలుస్తుంది. ఈ థ్రిల్లింగ్ యాక్షన్ మూవీని వేసవి సందర్భంగా జులై 23న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X