షాకింగ్: కరోనా సోకి హీరోయిన్ తండ్రి మృతి.. ఆందోళనలో ఇండస్ట్రీ
దేశవిదేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ మహమ్మారి వైరస్ బారినపడి ఇప్పటికే వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. రోజు రోజుకూ కరోనా భూతం కోరలు చాస్తుండటంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. తాజాగా ఓ హీరోయిన్ తండ్రి కూడా కరోనా బారినపడి మరణించాడనే వార్త సినీ ఇండస్ట్రీని కలవరపెడుతోంది. వివరాల్లోకి పోతే..

వేగంగా వ్యాప్తి.. జంకుతున్న ప్రజలు
చైనా దేశంలో పుట్టిన ఈ కరోనా వైరస్ చాలా వేగంగా అన్ని దేశాలకు వ్యాప్తి చెందింది. ఇప్పటికే 175 దేశాలకు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో ప్రపంచ జనాభా అంతా జంకుతున్నారు. ఇక ఈ కరోనా మహమ్మారి పలువురు సెలబ్రిటీలకు కూడా సోకడం మరింత ఆందోళన చెందిస్తోంది.

హీరోయిన్ తండ్రి మృతి.. ఉలిక్కిపడిన సినీ లోకం
ఇప్పటికే లక్షలాది మంది కరోనా వైరస్ బారినపడి ప్రాణాల కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇక హాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే కొందరు హీరోహీరోయిన్లు కూడా కరోనా బారిన పడటం ఆందోళన చెందిస్తుండగా.. ఇది చాలదన్నట్లు ఓ హీరోయిన్ తండ్రి ఇప్పుడు కరోనా సోకి మరణించారనే వార్త తెలిసి ఉలిక్కిపడింది సినీ లోకం.

హీరోయిన్ ప్రకటన.. అంతా షాక్
హాలీవుడ్ హీరోయిన్ సోఫియా మైల్స్ తండ్రి పీటర్ మైల్స్ కరోనా బారిన పడి ఆదివారం రోజు కన్నుమూశాడు. గత కొన్ని రోజులుగా కరోనా సోకి చికిత్స పొందుతున్న ఆయన చివరకు అనంతలోకాలకు వెళ్ళిపోయాడు. కరోనా కారణంగా తన తండ్రి చనిపోయిన విషయాన్ని సోఫియా మైల్స్ ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు. అంతేకాదు భయంతో వణికిపోయారు.
Recommended Video

దేశవ్యాప్తంగా 230.. ఒక్క తెలంగాణ లోనే 26
ఇకపోతే భారత దేశంలో కూడా కరోనా వీర విజృంభణ చేస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలను వణికిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 230 కేసులు, ఒక్క తెలంగాణలోనే 26 కేసులు నమోదయ్యాయి. దీంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతూ, ప్రజలకు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











